Neti Satyam
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 9:19 am Editor : Admin

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయండి సిపిఐ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం రంగారెడ్డి ఆగస్టు 5నేటి సత్యం రంగారెడ్డి

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడొద్దు

సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్

.తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్పులతోపాటు

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

బుధవారం నాడు డిఆర్ఓ శారదా దేవి ని కలిసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని నెల నెల స్కాలర్షిప్లను సక్రమంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు డిఆర్ఓ కు వినతి పత్రం అందజేశారు

వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్ర చారి సిపిఐ కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల నర్సింగ్ రావు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు కే రామస్వామి ముత్యాల యాదిరెడ్డి ఓరుగంటి యాదయ్య ఎండి ఫై మీద ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శివకుమార్ తదితరులు కలిసి వినతి పత్రాలు అందజేశారు

ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడవద్దని విద్యార్థుల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని ఫీజు రియంబర్నమెంట్ బకాయిలను విడుదల చేయాలని అలాగే హాస్టల్ విద్యార్థుల స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో విద్యార్థుల పక్షాన ఆందోళన పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు