Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 2:41 pm Editor : Admin

మోడీ శకం ముగియ బొతుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 6

నియంతలను గద్దె దించిన చరిత్ర ప్రజలది.

మోడీ ఉడుత ఊపులకు ఈతరం యువత భయపడదు.

మోడీ శకం ముగియబోతుంది.

నేపాల్ ,బంగ్లాదేశ్ ,శ్రీలంక పరిస్థితులు భారత పాలకులకు రానున్నాయి.

ఈటీ నరసింహ

సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి.

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో జాతీయ సమితి పిలుపులో భాగంగా ఆగస్టు 6 నుండి 14 వరకు జరిగే పాదయాత్రల ర్యాలీని ఈటి నరసింహ ప్రారంభించారు.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహము నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఎర్రజెండాలు చేతపట్టుకుని ఎర్ర షర్ట్స్, ఎర్ర శారిస్ ధరించిన కార్యకర్తలు, ప్రజానాట్యమండలి కళాకారుల డప్పుల చప్పులతో సిపిఐ కార్యకర్తలు కదం తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు.

కేంద్ర బిజెపి ప్రభుత్వం వైఫల్యాల పైన ముద్రించిన తెలుగు ఇంగ్లీష్ కరపత్రాలను షాప్ టు షాప్ పంచుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఈటి నరసింహ మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా తనకు ఎదురు లేదు అని విర్రవీగుతూ అహంకారంతో నియంతృత్వ ధోరణితిలో పరిపాలన కొనసాగించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతాంగం ,కార్మిక వర్గం, నిరుద్యోగ యువత, దళితులు, ఆదివాసులు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సంవత్సరాల తరబడి ఆందోళనలు నిరసనలు ఉద్యమాలు ఉదృతంగా కొనసాగించారు. ఉద్యమాలపై తప్పుడు ప్రచారం చేస్తూ అణచివేత కొనసాగించారు.

రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్టతను దెబ్బతీస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం తమకు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది.

వివిధ సమస్యల పైన ఉద్యమాలు నిర్వహిస్తున్న జర్నలిస్టుల పైన విద్యార్థుల పైన ఉద్యమకారుల పైన అత్యంత క్రూరమైన కఠినమైన చట్టాలను ప్రయోగించి జైళ్ల లో నిర్బంధించాడు.

చివరికి విద్యారంగానికి సంబంధించి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవ్వటానికి కారకులైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రారంభమైన జెన్ జీ ఉద్యమం నరేంద్ర మోడీ గత కొన్ని సంవత్సరాలు నిర్మించుకున్న ఇమేజ్ ను 20 రోజులలో కూల్చటం జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నియంత పరిపాలన కొనసాగించిన హిట్లర్ ముసోలిని కి పట్టిన గతి భారతదేశంలో నరేంద్ర మోడీ కి రాబోతున్నదని అన్నారు.

వర్తమాన రాజకీయాలలో నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ లలో యువతకు వ్యతిరేకంగా ప్రజా కంటక పాలన సాగించిన దేశ అధ్యక్షులు సొంత దేశాలను పారిపోయి పరిస్థితి వచ్చింది. ఇవాళ సరిగ్గా అలాంటి పరిస్థితులే మన దేశంలో కనిపిస్తున్నాయని అన్నారు.

ఎక్కడికక్కడ ఇంటర్నెట్ సౌకర్యాలు బందు చేసి యువత పైన ట్రోలింగ్ చేస్తూ అక్రమ కేసులు బనాయించాలని చూస్తే భవిష్యత్తులో చరిత్రహీనుడిగా నరేంద్ర మోడీ మిగిలిపోతాడు. ఇప్పటికైనా ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రజా అనుకూల విధానాలు తీసుకురాకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు వస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్ సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం .నరసింహ ,బి. వెంకటేశం , నేర్లఖంటి శ్రీకాంత్ ,కాంపల్లి శ్రీనివాస్, మామిడి చెట్ల వెంకటస్వామి,షేక్ శంషుద్దీన్ ,మహమ్మద్ సలీం ఖాన్, ఉమర్ ఖాన్,తోపాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు చెట్టుకింది శ్రీనివాస్ ఆరుట్ల రాజ్ కుమార్, బొడ్డుపల్లి కిషన్, కొమురెల్లి బాబు,సక్రి బాయీ , ఎన్. నరసింహ,చైతన్య, అనిల్, కళ్యాణ్, ch.జంగయ్య, సైఫ్,ఎన్ ఆర్ శ్రీనివాస్,సునీత, నర్సన్న, జ్యోతి, హైమద్, బిక్షపతి యాదవ్,బాలయ్య యాదవ్ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.