Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 2:55 pm Editor : Admin

సబ్ ప్లాన్ రిజర్వేషన్లు సంక్షేమ పథకాలపై సమీక్ష సూచన




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం-అభివృద్ధిపై మాదాపూర్ సీఎంసీ లో సమీక్ష సమావేశం

-సబ్‌ప్లాన్, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులకు కీలక సూచనలు

  • -చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

శేరిలింగంపల్లి, ఆగస్టు 6 ( నేటి సత్యం): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్, అన్ని జోన్ల కమిషనర్లు, వివిధ శాఖల విభాగాధిపతులు ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రత్యేక సబ్‌ప్లాన్ ద్వారా కాలనీల అభివృద్ధి, శ్మశాన వాటికలు, అప్రోచ్ రోడ్లు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు, వీధి వ్యాపారులకు సహాయం, పారిశుధ్య కార్మికులకు పిపిఈ కిట్లు, ఆరోగ్య బీమా, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉపాధి అవకాశాలు, ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుపై చర్చించారు. అలాగే అభివృద్ధి పనులు, టెండర్లలో రిజర్వేషన్ నిబంధనలు, బ్యాక్‌లాగ్ ఖాళీలు, రోస్టర్ అమలు, ఆర్థిక కేటాయింపులను సమీక్షిస్తూ శాఖల మధ్య సమన్వయం, సమర్థవంతమైన అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు.