(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బిజెపి ప్రజా వ్యతిరేక పాలన నిరసించండి
సిపిఐ తెలకపల్లి మండల కార్యదర్శి వేనేపల్లి రవీందర్
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్ర భుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న పాదయాత్రలను విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి వేనేపల్లి రవీందర్ పిలుపునిచ్చారు. శనివారం బాద్ రావు జరూరి హై మార్పు కావాలి అనే కరపత్రాలను వాల్పోస్టర్లను ఆయన గట్టు రాయిపాకులల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పై దేశవ్యాప్తంగా ఆందోళనలు, వ్యతిరేకత పెరుగుతున్నాయని అన్నారు. గత దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత పురోగతిని సాధించినట్లు ప్రకటించుకొగా ప్రజల నిజ జీవితం, దేశ ప్రగతి అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. పెరుగుతున్న నిరుద్యోగం తో పాటు దేశ ప్రజల ఆదాయాలు పెరగడం లేదని,ఫలితంగా ప్రజల జీవన విధానం మోయలేని భారంగా మారిందని అన్నారు. గ్రామాలలో సంక్షోభం తీవ్రంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఆలంబిస్తున్న తీరును ఆగస్టు 6నుంచి 14వరకు దేశవ్యాప్తంగా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా ఈనెల 10 తేదీన తెలకపల్లి మండలంలోని కార్వంగా మీదుగా 3రోజుల పాటు పాదయాత్రలు కొనసాగుతాయాన్ని
పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గట్టు రాయిపాకుల సిపిఐ కార్యదర్శి గొడుగు విష్ణు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.