(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం కొల్లాపూర్ ఆగస్టు 10
కొల్లాపూర్ లో ఘనం గా మంత్రి
జూపల్లి జన్మదిన వేడుకలు….
(యస్.పి. మల్లికార్జున సాగర్).
కొల్లాపూర్ శాసనసభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు జన్మదిన వేడుకలను సోమవారం రోజు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృష్ణారావు అభిమానులు ఘనం గా నిర్వహించుకున్నారు. ఈ సందర్భం గా కొల్లాపూర్ పట్టణం లోని శ్రీవాణి విద్యా నిలయం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కృష్ణారావు జన్మదిన వేడుకలను నిర్వహించగా ఇట్టి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇందిరాగాంధీ అభిమాన సంఘం అధ్యక్షుడు, నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రంగినేని జగదీశ్వరుడు ప్రసంగిస్తూ కొల్లాపూర్ ప్రాంతాన్ని కోనసీమ గా అభివృద్ధి చేస్తూ విద్యా వైద్య వ్యవసాయ రంగాలను అభివృద్ధి పరుస్తూ అనేక సేవలందిస్తున్న సహృదయ ప్రజా నాయకుడు మంత్రి కృష్ణారావు అని అన్నారు.
ఈ సందర్భం గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల హర్షధ్వానాల మధ్య వారి జన్మదిన సందర్భం గా కేక్ కట్ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు జన్మదినం సందర్భం గా విద్యార్థులకు స్వీట్స్,నోట్ పుస్తకాలను అలాగే మహిళలకు దుస్తులను కాంగ్రెస్ పార్టీ తరఫున రంగినేని జగదీశ్వరుడు పంపిణీ చేశారు.
ఇట్టి కార్యక్రమం లో న్యాయవాది మధుసూదన్ రావు, మురళి న్యాయవాది, మరియు, జమీల్ అహ్మద్ ఖాన్,రజక స్వామి, వెంకటస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.
కాగా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జూపల్లి కృష్ణారావు అభిమానులు జూపల్లి కృష్ణారావు జన్మదిన సందర్భం గా కొల్లాపూర్ పట్టణ వీధులలో ర్యాలీ నిర్వహిస్తూ అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకొని అంబేద్కర్ చౌరస్తాలో కేకు ను కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు.
మంత్రి జూపల్లి జన్మదిన సందర్భం గా ఎన్మన్ బెట్ల గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల నాగరాజు తో పాటు పలువురు రక్తదానం చేశారు.