Neti Satyam
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 9:48 am Editor : Admin

దేశ స్వాతంత్రం కోసం గణనీయమైన పోరాటం కమ్యూనిస్టులది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం / హైదరాబాద్ / ఆగస్టు 15

దేశ స్వాతంత్ర పోరాటం, దేశాభివృద్దిలో కమ్యూనిస్టులది ఘననీయమైన పాత్ర 

పల్లా వెంకటరెడ్డి

స్వాతంత్య్ర పోరాటంలో, అనంతరం దేశాభివృద్ధిలో కమ్యూనిస్టులది ఘననీయమైన పాత్ర అని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. భవిష్యత్తులో దేశ రక్షణ, రాజ్యాంగ పరిరక్షణతో పాటు సమసమాజ నిర్మాణం కోసం అదే దృఢనిశ్చయంతో పనిచేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులుగా మనపై ఉందన్నారు. ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగం, లౌకికవాదం, సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు మరిన్ని సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి. నరసింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌, రమావత్‌ అంజయ్య నాయక్‌, సిపిఐ సీనియర్ నాయకులరాలు టి. ప్రేమ్‌పావని, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారపాక అనిల్‌కుమార్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు ఎన్‌. శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

*సంపూర్ణ స్వాతంత్య్ర నినాదం ఇచ్చిన తొలి ఏకైక పార్టీ సిపిఐ: పల్లా వెంకటరెడ్డి*

భారత స్వాతంత్య్రోద్యమంలో సిపిఐ అగ్రగామి పాత్ర పోషించడమే కాకుండా, సంపూర్ణ స్వాతంత్య్రంకోసం నినాదం ఇచ్చిన తొలి ఏకైక రాజకీయ పార్టీ సిపిఐ అని పల్లా వెంకటరెడ్డి అన్నారు. స్వాతంత్య్రం అనంతరం అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూరై 80వ వసంతంలోకి అడుగుగిడుతున్నా ప్రజలు ఆశించిన సమాజం ఇంకా పూర్తిగా ఆవిష్కృతం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ 80 ఏళ్లలో దేశం కొంత అభివృద్ధి సాధించినప్పటికీ, ప్రజలందరూ స్వేచ్ఛగా, సమస్యలు లేకుండా జీవించే సమాజం ఏర్పడినప్పుడే దానిని నిజమైన అభివృద్ధిగా పరిగణించగలమన్నారు. ప్రతి ఒక్కరికీ తిండి, గుడ్డ, ఇల్లు, విద్య, ఉద్యోగాలు అందుబాటులోకి రావాలని సిపిఐనిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. పాలకుల వైఫల్యాలు, అసమర్థ నిర్ణయాల కారణంగా ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయని విమర్శించారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారుతున్న పరిస్థితి నెలకొందన్నారు. మరి ముఖ్యంగా బిజెపి ప్రభుత్వ హయాంలో రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజల సమస్యలు గతంతో పోలిస్తే మరింత తీవ్రంగా మారాయని అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, ఉపాధి, విద్య, సామాజిక న్యాయం తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ‘బద్లావ్‌ జరూరీ హై’ నినాదంతో సిపిఐ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. తెలంగాణలోనూ అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సెప్టెంబర్‌ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ, ప్రదర్శన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

*జన్‌-జీలఉద్యమాలతో బిజెపిలో వణుకుః*

ఇంతకాలం తమకు ఎదురే లేదని భావించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రజా ఉద్యమాలు వణుకు పుట్టించాయని అన్నారు. నీట్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌కు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌ వేదికగా జన్‌-జీల పోరాటం, పార్లమెంట్‌ లోపల, వెలుపల వామపక్షాలు, డిఎంకె, ఎన్‌సిపి,టిఎంసి, ఇండియా కూటమి తదితర పార్టీలు కలిసి ఉద్యమాలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటించాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి ఓడించడమే లక్ష్యంగా సిపిఐ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం వివిధ రాజకీయ, ప్రాంతీయ పార్టీలను కలుపుకొని విస్తృత ప్రజా ఐక్యతను నిర్మించేందుకు పార్టీ దృఢనిశ్చయంతో ముందుకు సాగుతుందని తెలిపారు.