(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం /శంషాబాద్/ ఆగస్టు 18
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది
సిపిఐ జాతీయ సమితి సభ్యులు పాలమాకుల జంగయ్య
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పాలమాకుల గంగయ్య అన్నారు
సిపిఐ రంగారెడ్డి జిల్లా ప్రజా చైతన్య యాత్ర నేడు శంషాబాద్ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా అంబేద్కర్ కూడలిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు ప్రభుత్వ విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆర్థిక సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
దేశంలోని నిరుద్యోగ యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని సత్యం విమర్శించారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలు వంటి ఘటనల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇలాంటి ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు, స్వతంత్ర సంస్థల పనితీరుపై ప్రజల్లో ఆందోళన నెలకొందని సత్యం అన్నారు. ప్రతిపక్షాల గొంతును అణచివేయడానికి ప్రయత్నాలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై జరిగే ఉద్యమాలను అణచివేయడం కాకుండా, ప్రజల డిమాండ్లను ప్రభుత్వం గౌరవించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోనూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాల్సిన అవసరం ఉందని సత్యం పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షన్ల పెంపు, రైతుల సమస్యల పరిష్కారం, యువతకు ఉద్యోగాల కల్పన, మహిళలకు ఇచ్చిన హామీల అమలు తదితర అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని, ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలని అన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ, భూముల సమస్యలపై రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సత్యం కోరారు. రైతుల హక్కులకు భంగం కలిగించే విధానాలను సీపీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు.
సీపీఐ ప్రజల పక్షాన నిలబడుతుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు. రైతులు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా ఉద్యమాలను మరింత విస్తృతం చేస్తామని అన్నారు.
రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు జంగయ్య అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాటాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
సీపీఐ జాతీయ పార్టీ పిలుపులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన ఐదు రోజుల బస్సు యాత్రలో భాగంగా ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జంగయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శివార్ల ప్రాంతాల నుంచి ప్రారంభమైన ఈ యాత్ర జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల మీదుగా కొనసాగుతుందని తెలిపారు.
సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల పార్టీ కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం
ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో దేశ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని జంగయ్య గుర్తుచేశారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా కొనసాగుతోందని అన్నారు. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు.
విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి దేశ ప్రజలకు ప్రయోజనం కల్పిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని జంగయ్య విమర్శించారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థ, ఎల్‌ఐసీ, విమానాశ్రయాలు వంటి ప్రజా ఆస్తులను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు
కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని ఆయన కోరారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక భద్రత వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలని అన్నారు.
మతం, కులం పేరుతో విభజన రాజకీయాలు వద్దు
ఎన్నికల సమయంలో మతం, కులం పేరుతో ప్రజల మధ్య విభజన సృష్టిస్తూ అసలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జంగయ్య విమర్శించారు. ప్రజలకు అవసరమైన ఉద్యోగాలు, ఉపాధి, విద్య, వైద్యం, రైతుల సమస్యలు, ధరల పెరుగుదల వంటి అంశాలపై రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశంలో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడేందుకు ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆగస్టు 21న భారీ బహిరంగ సభ
ఆగస్టు 21న అబ్బుల్లాపూర్‌మెట్ భూపోరాట కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా సీపీఐ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు, రైతులు, కార్మికులు, కర్షకులు, కూలీలు, విద్యార్థులు, యువత, పార్టీ సానుభూతిపరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, దేశంలో ప్రత్యామ్నాయ ప్రజా విధానాల కోసం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఐదు రోజుల బస్సు యాత్రను ప్రజలు ఆదరించాలని, ప్రతి మండలం, గ్రామంలో యాత్రకు ప్రజల మద్దతు లభించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని జంగయ్య కోరారు.
ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, పేదల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా చైతన్య బస్సు యాత్రలో సిపిఐ రాష్ట్రస కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్ర చారి కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల నర్సింగ్ రావు పానుగంటి పర్వతాలు బుద్ధుల జంగయ్య ఓరుగంటి యాదయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం ప్రభు లింగం ఆర్ యాదగిరి పి శివకుమార్ శ్రీదేవి దత్తు నాయక్ గార క్రాంతి వంశి వర్ధన్ రెడ్డి సుధాకర్ నర్రగిరి తదితరులు పాల్గొన్నారు
