(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం/ శేర్లింగంపల్లి / ఆగస్టు 18
22ఏ జాబితాతో ప్రజల్లో భయాందోళన
*ప్రజల ఆస్తుల్లో అంగుళం కూడా ఆటంకం కలగకూడదు*
*టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు*
22ఏ జాబితా పేరుతో ప్రజల ఆస్తులపై నెలకొన్న అనిశ్చితి, భయాందోళనలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఏళ్ల తరబడి ప్రజలు తమ కష్టార్జిత సొమ్ముతో కొనుగోలు చేసుకుని, చట్టబద్ధంగా అనుభవిస్తున్న భూములు, ఇళ్లపై 22ఏ జాబితా పేరుతో ఆంక్షలు విధించడం సరికాదన్నారు. సరైన విచారణ లేకుండా ఏ ఒక్కరి ఆస్తి హక్కులకు భంగం కలిగించకూడదని స్పష్టం చేశారు.
ప్రజల ఆస్తుల్లో అంగుళం కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 22ఏ జాబితాలో ఉన్న భూములపై పారదర్శకంగా సమగ్ర విచారణ నిర్వహించి, అర్హులైన ప్రజల ఆస్తులను ఎటువంటి ఆటంకాలు లేకుండా రక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా ప్రత్యేకంగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, తప్పుడు నమోదులు లేదా పొరపాట్ల వల్ల బాధితులైన వారికి న్యాయం చేయాలని రామకృష్ణ అన్నారు.
ప్రజల ఆస్తుల రక్షణే ప్రభుత్వ బాధ్యత అని, హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.