Neti Satyam
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 8:10 am Editor : Admin

చక్కెర ధర వింటే చెక్కరో స్తుంది …?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శ్రావణ మాసం లో కొండెక్కిన” చక్కెర.”…

చేదేక్కుతున్న”బెల్లం”””

(యస్.పి. మల్లికార్జున సాగర్).

కొల్లాపూర్, ఆగస్టు 24, నేటి సత్యం.

శ్రావణమాసం అంటే నే పెండ్లి ల్లు, శుభకార్యాలు ఇబ్బడి ముంబడిగా జరిగే మాసం.

అయితే శుభకార్యాలు జరిగే ఇలాంటి శ్రావణ మాసం లో తీపి వంటలు చేసుకు తినాలనుకునే జిహ్వ చాపరుల కు చక్కెర ధర కొండెక్కి చేదు ఎక్కడము తో రోజురోజుకు పెరుగుతున్న చక్కెర ధరలను చూసి పిండి వంటలు చేయించుకోవడానికి అన్న మసాలా కూరగాయల వంటలు చేసుకోవడం మేలని శుభకార్యాలు చేసుకునేవారు తీపి వంటకాలకు”చెక్” పెట్టుకొని చక్కెర కు ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకుంటున్నారు.

నిన్న మొన్నటి దాకా కిలో 42 రూపాయలుగా ఉన్న చక్కెర ధర ఇవాళ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లో బహిరంగ మార్కెట్లో 75 రూపాయల కు కిలో కు చేరినది.

ఇలా చక్కెర ధర ఎందుకు పెరుగుతున్నదని వినియోగదారులు ఒకపక్క ఆందోళన చెందుతుంటే చక్కెర స్టాక్ ఉన్న వ్యాపారులు సంబరపడుతూ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వినియోగదారులకు ఎరుక చేయకుండా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ పెరిగిన ధరలు తమకు లాభాలు చేకూరుస్తాయని సంతోషపడుతున్నారు.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బంగారం తులం ధర పెరుగుతే దానికి అనుగుణం గా వెండి ధరలు కూడా ఎలా పెరుగుతున్నాయో అలాగే చక్కెర ధర పెరుగుతుండగా దానికి అనుగుణం గా కిలోబెల్లం 60 రూపాయలు ఉండేది ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 80, 90 రూపాయలుగా వ్యాపారులు విక్రయిస్తుండడం తో తీపి వంటలు చేసుకునీ తినాలనుకునే కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని ప్రజలు రోజురోజుకు పెరుగుతున్న చక్కెర బెల్లం ధరలను చూసి బెంబే లెత్తి పోతున్నారు.