(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హత్య రాజకీయాలు మావి కావు చనిపోయేవాళ్ళని సైతం బ్రతికించడం మా నైజం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కామారెడ్డి ఆగస్టు 30 నేటి సత్యం ప్రతినిధి హత్య రాజకీయాలు చేయడం మా అభిమతం కాదని చనిపోయే వాళ్ళని సైతం బ్రతికించడం మా నైజం అని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు కావస్తున్నా ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజలందరినీ మోసం చేసిందని బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు.
బాన్సువాడలో జరిగిన సమారభేరి సన్నాహక సభలో ఆయన మాట్లాడుతూ..
వర్ని కోటగిరిలో మండలాలలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల విషయం కొందరు నాయకులు తమపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ నియోజకవర్గ ప్రజలను తప్పు దోవ పట్టించి తమను బద్నాం చేయాలని చూస్తున్నారని వాళ్లు నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు నేను చనిపోయే వాళ్లను బ్రతికిస్తాను, చంపడం నా సంస్కృతి కాదు” అని అన్నారు.
నా హయాంలోనే బాన్సువాడ నుండి నిజామాబాద్ డబుల్ రోడ్, నిజాంసాగర్ కెనాల్ లైనింగ్ వంటి అభివృద్ధి పనులు చేయించానని అన్నారు కేసీఆర్ నిధులు మంజూరు చేస్తే ఆ నిధులతో అభివృద్ధి చేసి నేనే చేశానని చెప్పుకుంటున్నారు ఇక్కడి నాయకులు అని ఆయన ఎద్దేవ చేశారు దమ్ముంటే నిధులు తీసుకురండి” అని సవాల్ విసిరారు.
మీరు ఇచ్చిన అధికారంతోనే ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరాలని ఎవరైనా బెదిరిస్తే వారి పేర్లు రాసి పెట్టండి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తున్నా ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసన కార్యక్రమాలు, ఎనిమిది రోజుల పాటు ‘పోరుబాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు బాజిరెడ్డి తెలిపారు.
ఇందులో భాగంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అధికారికంగా ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్నారని, దీన్ని విజయవంతం చేయాలన్నారు. బాన్సువాడలో బి ఆర్ ఎస్ బలపడడంతో కొందరు నాయకులకు నిద్ర పట్టడం లేదని వ్యక్తిగతంగా జరిగిన హత్యలను కక్షలను తనకు ఆపాదించాలని చూస్తున్నారని బాన్సువాడ ప్రజలకు అంతా తెలుసు అని వచ్చి ఎన్నికలలో బాన్సువాడ లో ఎగిరేది బిఆర్ఎస్ జండా అని ఆయన అన్నారు