Neti Satyam
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 2:09 pm Editor : Admin

మూడేళ్ల బాలుడు కిడ్నాప్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

హాస్పిటల్లో మూడేళ్ల బాలుడు కిడ్నాప్
నిజామాబాద్ సెప్టెంబర్ 5 నేటి సత్యం ప్రతినిధి

నిజామాబాద్ పట్టణంలోనిప్రభుత్వ మాత శిశు ఆసుపత్రి నుండి మూడేళ్ల బాలుడు వెంధాన్ష్ కిడ్నాప్ గురయ్యాడు
బాల్కొండ మండలం నాగేపూర్‌కు చెందిన నరేష్ సంధ్య దంపతుల కుమారుడు వేదాన్ష్.. ను గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
జిల్లా ఆసుపత్రికి సంధ్యారాణి–నరేష్ దంపతులు.. డెలివరీ కోసం వచ్చినట్లు సమాచారం
ఆసుపత్రిలో ఉన్న సమయంలో వేదాన్ష్ అదృశ్యం. కాగా
ఓ మహిళ చాక్లెట్ ఇస్తానంటూ బాలుడిని తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యుల అనుమానం.. వ్యక్తం చేస్తున్నారు
బాబు ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

పోలీసులు సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టారు
బాలుడిని ఒక మహిళా తీసుకెళ్లినట్లు దృశ్యాలు.. సీసీ కెమెరాలు నిక్షిప్తమై ఉన్నాయి కాగా సదరు మహిళ కోసం అన్ని రహదారుల పైన బస్ స్టేషన్ లో ఆటో స్టాండ్ ల వద్ద పోలీసులు గాలింపులు చేపడుతున్నారు ఆసుపత్రిలో సెక్యూరిటీ నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు