Neti Satyam
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 1:56 pm Editor : Admin

గణేష్ చవితి శుభాకాంక్షలు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేరిలింగంపల్లి సెప్టెంబర్ 13
గణేష్ చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, సీపీఐ శ్రేణులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖల అధికారులు, సిబ్బందికి, పత్రికా విలేకరులకు హృదయపూర్వక గణేష్ చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ సందర్భంగా ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత, సామరస్యం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నాను.

వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించుకోవాలని కోరుతున్నాను. ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి వెల్లివిరియాలని కోరుకుంటూ మరోసారి అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు.