Neti Satyam
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 10:09 am Editor : Admin

మంత్రి సీతక్క పర్యటన..

నేటి సత్యం కామారెడ్డి సెప్టెంబర్ 15.

ఉభయ జిల్లాలో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన

కామారెడ్డి జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో సమీకృత పాఠశాల భవన నిర్మాణానికి సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి మంత్రి నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు.

పర్యటనలో భాగంగా పాఠశాలకు చేరుకున్న మంత్రి సీతక్కకు ముందుగా ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికి సన్మానించారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, ఆధునికీకరణ పనులు, ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ కింద చేపట్టిన అభివృద్ధి పనులను కూడా మంత్రి ప్రారంభించారు. డిజిటల్ తరగతులు, సురక్షిత తాగునీరు, అదనపు గదులతో విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీతక్క సూచించారు.