Neti Satyam
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 7:52 am Editor : Admin

రివల్వార్ మిస్ ఫైర్ తో ఆర్ ఐ సతీష్ మృతి..

నిజామాబాదు / నేటి సత్యం/ సెప్టెంబర్18
నిజామాబాద్ పోలీస్ శాఖలో విషాదం – రివాల్వర్ మిస్ ఫైర్ తో ఆర్ఐ సతీష్ మృతి

నిజామాబాద్ పోలీస్ శాఖలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో పనిచేస్తున్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) హెచ్. సతీష్ (40) రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

శుక్రవారం ఉదయం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో సతీష్ తన సర్వీస్ రివాల్వర్ ను శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. బుల్లెట్ తగలడంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు.

గన్ పేలిన శబ్దం విని ఇతర సిబ్బంది పరుగున వచ్చి చూసేసరికి సతీష్ తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనను అధికారికంగా ధ్రువీకరించారు.

*పోలీస్ శాఖలో విషాద ఛాయలు:*

సతీష్ మృతి జిల్లా పోలీస్ శాఖను తీవ్రంగా కలచివేసింది. హెడ్ క్వార్టర్స్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సహచర అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

మృతుడు సతీష్ స్వస్థలం ఖమ్మం జిల్లా కొత్తపల్లి అని, NSB సెలవులు ముగించుకుని తిరిగి విధులకు హాజరయ్యారని తోటి సిబ్బంది తెలిపారు.

పోలీస్ శాఖ అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది