Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 10:58 am Editor : Admin

విజిలెన్స్ దాడిలో బియ్యం పట్టివేత

రెడ్డిపేటలో విజిలెన్స్ దాడులు పిడిఎస్ బియ్యం పట్టివేత
కామారెడ్డి సెప్టెంబర్ 21 నేటి సత్యం ప్రతినిధి రామారెడ్డి మండలం రెడ్డిపేటలో సోమవారం మధ్యాహ్నం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు రెడ్డిపేటలోని ఓ రైస్ మిల్‌ పై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు 275 క్వింటాళ్ల అక్రమ పీడీఎస్ బియ్యం ఉన్న లారీని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది
బియ్యంతో ఉన్న లారీని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపునకు సంబంధించి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా అక్కడికి వెళ్లిన మీడియాతో వారు మాట్లాడుతూ పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు