నేటి సత్యం/ శేర్లింగంపల్లి సెప్టెంబర్ 23
క్యూర్ పరిధిలో శేరిలింగంపల్లి ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు నేడు శ్రీకారం,క్యూర్ పరిధిలో ఏడాది లో లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం,ఏడాదిలో గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళిక,అర్హులైన పేదలకు పారదర్శకంగా లక్కీడిప్ ద్వారా కేటాయింపు*
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం విలేజ్ మల్కం చెరువు వెనుక, 2.85 ఎకరాలలో (11,551.24 చ.మీ.) నూతనంగా నిర్మించబోయే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కొరకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో గౌరవ హౌసింగ్, రెవెన్యూ శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ MLC శ్రీ బోగారపు దయానంద్ గుప్తా గారు,గౌరవ యాదవ కో ఆపరేటివ్ చైర్మన్ శ్రీ రఘునాథ్ యాదవ్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి గారు ,గౌరవ హౌసింగ్ PD శ్రీ నాయక్ గారు, గౌరవ RDO శ్రీ శ్రీధర్ గారు, గౌరవ తహసీల్దార్ శ్రీ మహిపాల్ రెడ్డి గారు, గౌరవ తాజా మాజీ కార్పొరేట్లు శ్రీ దొడ్ల వెంకటేశ్ గౌడ్ గారు, శ్రీ జగదీశ్వర్ గౌడ్ గారు, శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు, శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి గార్ల తో కలిసి పాల్గొన్న గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెక పూడి గాంధీ గారు .