నేటి సత్యం / శేరిలింగంపల్లి / సెప్టెంబర్24
యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
ప్రజలు, చిన్న వ్యాపారులపై అదనపు భారం మోపడం కేంద్రం మానుకోవాలి
*టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి*
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో డిజిటల్ చెల్లింపులపై అదనపు భారం మోపే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి టి. రామకృష్ణ డిమాండ్ చేశారు.
దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యాపారి లావాదేవీలపై యండిఆర్ విధించే విధానాన్ని తీసుకురావడం చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులపై అదనపు ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందన్నారు. కేంద్రం ప్రకటించిన కొత్త విధానంలో ₹2,000 పైబడిన నిర్దిష్ట వ్యాపారి లావాదేవీలకు ఎండి ఆర్ వర్తిస్తుందని తెలిపారు.
ఇప్పటికే పెరుగుతున్న ధరలు, పన్నులు, వ్యాపార నిర్వహణ ఖర్చులతో సతమతమవుతున్న చిన్న వ్యాపారులపై మరో రకమైన చెల్లింపు భారం మోపడం సమంజసం కాదన్నారు. ఈ ఖర్చు చివరకు వస్తువుల ధరల పెరుగుదల రూపంలో వినియోగదారులపై పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
డిజిటల్ ఇండియా పేరుతో ప్రజలను, చిన్న వ్యాపారులను భారాల బాట పట్టించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. యూపీఐ వంటి ప్రజలకు ఉపయోగపడే డిజిటల్ చెల్లింపు వ్యవస్థను పూర్తిగా ఉచితంగా కొనసాగించడంతో పాటు, చిన్న వ్యాపారులపై ఎలాంటి ఎం డి ఆర్ భారం లేకుండా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజల జేబులకు చిల్లు పెట్టే విధానాలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, యూపీఐ పై ఛార్జీల విధానాన్ని పునఃపరిశీలించి పూర్తిగా ఉపసంహరించుకోవాలని టి. రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజలు, చిన్న వ్యాపారులపై అదనపు భారం మోపడం కేంద్రం మానుకోవాలి
టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో డిజిటల్ చెల్లింపులపై అదనపు భారం మోపే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి టి. రామకృష్ణ డిమాండ్ చేశారు.
దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యాపారి లావాదేవీలపై ఎం డి ఆర్ విధించే విధానాన్ని తీసుకురావడం చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులపై అదనపు ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందన్నారు. కేంద్రం ప్రకటించిన కొత్త విధానంలో ₹2,000 పైబడిన నిర్దిష్ట వ్యాపారి లావాదేవీలకు యం డి ర్ వర్తిస్తుందని తెలిపారు.
ఇప్పటికే పెరుగుతున్న ధరలు, పన్నులు, వ్యాపార నిర్వహణ ఖర్చులతో సతమతమవుతున్న చిన్న వ్యాపారులపై మరో రకమైన చెల్లింపు భారం మోపడం సమంజసం కాదన్నారు. ఈ ఖర్చు చివరకు వస్తువుల ధరల పెరుగుదల రూపంలో వినియోగదారులపై పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
డిజిటల్ ఇండియా పేరుతో ప్రజలను, చిన్న వ్యాపారులను భారాల బాట పట్టించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. యూపీఐ వంటి ప్రజలకు ఉపయోగపడే డిజిటల్ చెల్లింపు వ్యవస్థను పూర్తిగా ఉచితంగా కొనసాగించడంతో పాటు, చిన్న వ్యాపారులపై ఎలాంటి ఎండీర్ భారం లేకుండా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజల జేబులకు చిల్లు పెట్టే విధానాలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, యూపీఐ పై ఛార్జీల విధానాన్ని పునఃపరిశీలించి పూర్తిగా ఉపసంహరించుకోవాలని టి. రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.