Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 1:47 pm Editor : Admin

హౌస్ టాక్స్ సమస్యలను పరిష్కరించండి రాధాకృష్ణ యాదవ్

నేటి సత్యం/ శేర్లింగంపల్లి / సెప్టెంబర్ 28

ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ కాలనీ హౌస్ ట్యాక్స్ సమస్యలపై కమిషనర్‌కు వినతిపత్రం అందించిన గంగల రాధాకృష్ణ యాదవ్

హైదరాబాద్: ఇజ్జత్‌నగర్ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన పలువురు కాలనీ వాసులతో కలిసి గంగల రాధాకృష్ణ యాదవ్ (Contested Corporater) సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి, కాలనీలోని హౌస్ ట్యాక్స్‌కు సంబంధించిన సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఇటీవల జారీ చేసిన హౌస్ ట్యాక్స్ డిమాండ్ నోటీసుల్లో ఆస్తి యజమానుల పేర్లు మరియు ఆస్తి వివరాల్లో ఉన్న తప్పులు, అసమానతలను సరిచేయాలని కోరుతూ కాలనీ ప్రజల తరఫున కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత రికార్డులను పరిశీలించి, తప్పుగా ఉన్న వివరాలను సరిచేసి, నిజమైన ఆస్తి యజమానుల పేర్లను సక్రమంగా నమోదు చేసి, సవరించిన హౌస్ ట్యాక్స్ డిమాండ్ నోటీసులను జారీ చేయాలని కోరారు.

కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను సానుకూలంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను గంగల రాధాకృష్ణ యాదవ్ కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి,భారతి, పవన్ రెడ్డి ,కుమార్, బాలమ్మ ,వంశీ యాదవ్, మేఘాంశ్, తదితరులు పాల్గొన్నారు. ‎