Neti Satyam
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 12:27 pm Editor : Admin

మాదిగ సంక్షేమ సంఘం..

నేటి సత్యం/ అక్టోబర్ 5
కేసముద్రం లో మాదిగ సంక్షేమ సంఘం ఏర్పాటు కమిటీ నాయకులకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

మాదిగల ఐక్యత కోసం మాదిగ సంక్షేమ సంఘం ఏర్పాటు అంబేద్కర్ ఆశయాలకు నాంది – మండల పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్

నేటి సత్యం అక్టోబర్ 5 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య

రూ.2 కోట్లతో కేసముద్రం లో అంబేద్కర్ భవన నిర్మాణం వేం నరేందర్ రెడ్డి,ఉమా మురళి నాయక్, బలరాం నాయక్‌, గంట సంజీవరెడ్డి గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు

అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తిగా మాదిగల కష్టసుఖాల్లో మేమున్నామంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మయ్యగౌడ్
నిమ్నజాతుల ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ – పీసీసీ సభ్యులు దస్రు నాయక్ అన్నారు
సంఘం మనోభావాలను గుర్తించి,గౌరవించిన మండల కాంగ్రెస్ పార్టీ కి,సమ్మిగౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు -అధ్యక్షులు పోలేపాక ఉప్పలయ్య మాట్లాడారు
కేసముద్రం మండలం
ఒక సంఘం ఏర్పాటు చేయడం అంటే కేవలం కొంతమంది కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం కాదు.. ఒక సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక వేదికను నిర్మించడం.తమ కష్టాలను తామే చర్చించుకునే అవకాశం కల్పించడం.తమ హక్కులు,ఆకాంక్షలు,ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం ఒకే మాటపై నిలబడేలా ఐక్యతను పెంచడం.ఇదే ఆలోచన తో కేసముద్రం మండలం లోని మాదిగ కులస్థులు మహబూబాబాద్ జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రం లోనే ఏ మండలం లో ఇప్పటివరకు లేని ఒక నూతన ఆలోచనా విధానాన్ని, గత కొన్ని నెలలుగా ఊరురా,వాడ, వాడనా తిరిగి తమ జాతి బిడ్డలను ఒక్కతాటి మీదకు తీసుకువచ్చి కేసముద్రం మండల కేంద్రంలో మాదిగ సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది.. *జాతి హితం కోసం ఏర్పాటు చేసిన మాదిగ సంక్షేమ సంఘం కోసం పనిచేస్తున్న సంఘం నాయకులకు కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు చిలువేరు సమ్మయ్యగౌడ్ ఘనంగా సన్మానం చేశారు.

మాదిగల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంఘాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తున్న నాయకుల సేవలను గుర్తించి వారిని గౌరవించడం ద్వారా సమ్మయ్యగౌడ్ తనకున్న సామాజిక బాధ్యతను మరోసారి చాటుకున్నారని సంఘం నాయకులు పేర్కొన్నారు. సన్మానం అనేది ఒక కార్యక్రమంగా ముగిసిపోయేది కాదని.. సేవ చేస్తున్న వారిని గుర్తించి మరింత ఉత్సాహంతో ముందుకు నడిపించే ప్రోత్సాహమని వారు అన్నారు.

కేవలం సంఘం కాదు.. భవిష్యత్ తరాలకు ఒక వేదిక- పీసీసీ సభ్యులు దస్రు నాయక్

పీసీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దస్రు నాయక్ మాట్లాడుతూ కేసముద్రం మాదిగ సంక్షేమ సంఘం స్థాపనను,కార్యావర్గాన్ని, సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చెయ్యాలనే మంచి ఆలోచన చేసినటువంటి అధ్యక్షులు సమ్మిగౌడ్ ని అభినందిస్తూ…సంఘం కార్యక్రమాలకు శాశ్వత వేదికగా నిలిచేలా కేసముద్రం మండల ప్రాంతం లో కాంగ్రెస్ పార్టీ,స్థానిక శాసనసభ్యులు డా.మురళీనాయక్, యంపీ బలరాం నాయక్ చొరవతో, వేం నరేందర్ రెడ్డి గారి బలమైన సంకల్పం తో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన్ మీకు ఒక మనిహారం అని, మాదిగల సమావేశాలు,సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ కమిటీ హాల్ ఉపయోగపడనుందని అన్నారు

ఒక భవనం నిర్మించడం కంటే.. ఒక సమాజానికి భవిష్యత్తును నిర్మించేందుకు వేదికను కల్పించడం గొప్ప విషయమని దస్రు నాయక్ పేర్కొన్నారు. ఈ అంబేద్కర్ భవన్ రాబోయే తరాలకు కూడా ఉపయోగపడేలా, మాదిగల సామాజిక పురోగతికి కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు

అంబేద్కర్ ఆశయాల సాధనకు ఐక్యతే బలం-కాంగ్రెస్ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్

ఈ సందర్భంగా సమ్మయ్యగౌడ్ మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపించిన రాజ్యాంగ మార్గం ప్రతి ఒక్కరికీ సమానత్వం, ఆత్మగౌరవం, హక్కులు, అవకాశాల కోసం పోరాడే స్ఫూర్తిని ఇచ్చిందన్నారు.

మాదిగ సమాజం విద్య, ఉద్యోగం, ఆర్థిక అభివృద్ధి, సామాజిక చైతన్యం వైపు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమాజం అభివృద్ధి చెందాలంటే యువత చదువులో ముందుండాలని,ఆర్ధికంగా బలపడే దిశగా అడుగులు వేస్తూ వ్యాపారరంగం వైపు అడుగులు వేయాలని ఆ దిశగా వెళ్లే బిడ్డలకు పెద్దలు మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.మహబూబాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారి గా గొప్ప ఆలోచనా విధానం తో, భవిష్యత్ తరాలకు బాటలు వేసే దిశగా అన్ని మండలాల మాదిగ బిడ్డలకు ఆలోచన కలిగించేలా కేసముద్రం మాదిగ సంక్షేమ సంఘం ఏర్పాటు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అడుగులు బలపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేసారు.గత కొన్ని నెలలుగా గ్రామ, గ్రామాన తిరిగి తమ కులాన్ని చైతన్యం చేసి సంఘాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్షులు ఉప్పలయ్య గారిని,సంఘం కమిటీని సహకరించిన ప్రతీ మెంబెర్ ని అభినందించారు

కాంగ్రెస్ పార్టీ కేసముద్రం మండలం లో మాదిగ బిడ్డల భవిష్యత్ ని, వారి ఆత్మ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.2 కోట్లతో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన నిర్మాణమే మాదిగ జాతి పట్ల,వారి భవిష్యత్ పట్ల కాంగ్రెస్ పార్టీ కి ఉన్న చిత్తశుద్ధి,ప్రేమ అర్థం అవుతుంది అన్నారు.. ఈ సందర్బంగా అంబేద్కర్ భవన నిర్మాణానికి సహకరించిన రాజ్యసభ సభ్యులు గౌరవ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్‌,మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి గార్లకు మాదిగ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతో మాదిగల కోసం నిర్మితమవుతున్న ఈ వేదిక భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ ఆశాబాహం వ్యక్తం చేసారు

మాదిగ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులను సన్మానించడం తనకు ఎంతో గౌరవంగా ఉందని,వీరిని గౌరవించడం అంటే అంబేద్కర్ ఆశయాలను గౌరవించినట్టేనని,సంఘం చేపట్టే మంచి కార్యక్రమాలకు తన వంతు సహకారం తన చివరి శ్వాస వరకు ఉంటుందని సమ్మయ్యగౌడ్ తెలిపారు.

మమ్మల్ని గుర్తించి గౌరవించిన సమ్మయ్యగౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు – అధ్యక్షులు పోలేపాక ఉప్పలయ్య

మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పోలేపాక ఉప్పలయ్య మాట్లాడుతూ తమ సంఘాన్ని ఏర్పాటు చేసి మాదిగల సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకులను గుర్తించి సన్మానించిన సమ్మయ్యగౌడ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మా సేవలను గుర్తించి మమ్మల్ని సన్మానించడం మాకు దక్కిన గౌరవం మాత్రమే కాదు.. మాదిగల కోసం ఇంకా ఎక్కువ పనిచేయాలనే బాధ్యతను పెంచింది” అని ఉప్పలయ్య అన్నారు.

మాదిగల మధ్యకు వచ్చి వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, తమతో ఒక కుటుంబ సభ్యుడిలా మమేకమవుతున్న సమ్మయ్యగౌడ్ తీరు తమకు ఎంతో ధైర్యాన్నిస్తోందన్నారు. మాదిగల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమం చేపట్టినా ఆయన సహకారం ఉంటుందనే నమ్మకం తమకు ఉందన్నారు.

మాదిగ సంక్షేమ సంఘం ఇకపై కేవలం ఒక సంస్థగా కాకుండా మాదిగల సమస్యలకు స్పందించే వేదికగా, యువతకు మార్గనిర్దేశం చేసే కేంద్రంగా, సామాజిక చైతన్యానికి చిరునామాగా ముందుకు సాగుతుందని, మావాళ్ళను సమాజం లో నిలబెడెలా ఆర్ధిక, సామజిక చైతన్యం తీకురావడమే మా ప్రధాన ఎజెండా గా పనిచేస్తామని తెలిపారు

ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మంద సాయిబాబా, ప్రధాన కార్యదర్శి బుర్ర గుండ్ల యాదగిరి, కోశాధికారి పందుల సారయ్య, ముఖ్య సలహాదారులు పోలేపాక నాగరాజు, జల్లే మాకామ్రం, మేడి శ్రీనివాస్, వల్ల దాస్ దేవాదానం, మేరకు ఉపేందర్, దండు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లందాసు రవి,దామరకొండ ప్రవీణ్,సర్పంచ్ లు వీరాస్వామి, శ్రీనివాస్ నాయక్, రామచంద్రు, మాజీ సర్పంచ్ లు నాగేల్లి శ్రీను, రవీందర్,మాజీ ఎంపీటీసీ లు మేడి ఉపేందర్, రేసు శ్రీనివాస్ గౌడ్,కథ ప్రభాకర్,గ్రామ పార్టీ అధ్యక్షులు నరేటి కొమురయ్య, మిట్టగడుపుల యాకుబ్, గంధసిరి సారయ్య, కాలేరు వెంకన్న,వల్లాల రాజేందర్,మిట్టగడుపుల యాకన్న,ఏలీయా,చెడుపల్లి ఎలందర్,దండు శ్రీనివాస్, కంటిపూడి అరుణ్ కుమార్, రవి, కరుణాకర్, కుమార్, రాజు, రాజా నాయక్ తదితరులు పాల్గొన్నారు

కేసముద్రం నేలపై మాదిగల కోసం ఏర్పడిన ఈ సంక్షేమ వేదిక.. ఒక్కరోజు కార్యక్రమంతో ముగిసేది కాకుండా, ఐక్యతతో ముందుకు సాగితే రాబోయే తరాలకు ఒక బలమైన సామాజిక వారసత్వంగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తమైంది