Neti Satyam
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 12:27 pm Editor : Admin

ఇఎస్ఐ మల్టీస్పెషల్టి హాస్పిటల్ నిర్మించండి.

నేటి సత్యం/ శంషాబాద్/ అక్టోబర్17

రంగారెడ్డి జిల్లాలో ESI మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలి

ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పానుగంటి పర్వతాలు డిమాండ్

. రంగారెడ్డి జిల్లాలో మల్టీ స్పెషాలిటీ ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు

ఈరోజు శంషాబాద్ టౌన్ లోన్. లో జరిగిన ఏఐటీయూసీ జిల్లా ఆఫీసు బేరర్స్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు జిల్లాలో లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఏదైనా సమస్య వస్తే సనాతన గారు లేదా నాచారం వెళ్లి చూయించుకోవాల్సిన దుస్థితి ఉందని ఆయన తెలిపారు

ప్రభుత్వాలకు కార్మికుల ఓట్లు కావాలి కానీ వారి పరిస్థితిలో పట్టవా అని ఆయన ప్రజాప్రతినిధులను నిలదీశారు

పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని ఉద్యోగ భద్రత లేదని ఆయన అన్నారు

రాబోయే కాలంలో కార్మిక హక్కుల కోసం కనీస వేతనాలు అమలు కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు

ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వడ్ల సత్యనారాయణ అధ్యక్షత వహించారు ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు కే రామస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి బి దత్తు నాయక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పబ్బతి లక్ష్మణ్ తుపాకుల రాములు.నాగరాజు తదితరులు పాల్గొన్నారు