Neti Satyam
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 12:33 pm Editor : Admin

మియాపూర్ భూములు ప్రజల వే డాక్టర్ కే నారాయణ

నేటి సత్యం/ శేరిలింగంపల్లి /అక్టోబర్ 31

మీయాపూర్ ప్రభుత్వ భూములను గద్దల పాలు కాకుండా పేదలకు దక్కే విధంగా

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ

మియాపూర్ సర్వేనెంబర్ 100 మరియు 101 ఇతర నెంబర్లలోని సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమిని గద్దలపాలు కాకుండా ప్రభుత్వం ఆ భూములను కాపాడి పేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే నారాయణ డిమాండ్ చేశారు

ఈరోజు సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు టి రామకృష్ణ శేర్లింగంపల్లి మండల కార్యదర్శి చందు యాదవ్ వెంకట్ స్వామి ఇతర నాయకులతో కలిసి మియాపూర్ లోని ప్రభుత్వ భూములను శనివారం నాడు పరిశీలించారు

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా న్యాయస్థానాలలో ఈ భూములపై అనేక చర్చలు జరిగాయి ఈ 34 సంవత్సరాల లో ఎన్నో ప్రభుత్వాలు మారిన ఏ ప్రభుత్వం కూడా ఈ భూములను క్లేమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం బాధాకరమని ఆయన అన్నారు

ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమి అని తీర్పునిచ్చిన తర్వాత గత ప్రభుత్వం నేటి ప్రభుత్వం పోటీపడి ప్రెస్ మీట్ లు పెట్టి మా క్రెడిబుల్టి అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు

మియాపూర్ ప్రభుత్వ భూములలో ఇప్పటికే నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను పేదలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించి పట్టాలు ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు

సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాల కోసం కేటాయించకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు గుడిసెలు వేయించి భూ పోరాటం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ. సీపీఐ శేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే చందు యాదవ్

దళిత కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కె వెంకటస్వామి. ఎస్ కొండలయ్య జెట్టి శ్రీను ఎం వెంకటేష్ కే ఖాసీం కె సుధాకర్ తుపాకుల రాములు ఎస్ నారాయణ రఘు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు