నన్ను అరెస్టు చేసినట్లు కాదు…
మంత్రి “జూపల్లి” ని అధికారులను తిరుగనివ్వం ..
(యస్.పి. మల్లికార్జున సాగర్).
కొల్లాపూర్, అక్టోబర్ 31, నేటి సత్యం.
నన్ను పోలీసులతో అరెస్టు చేయించినంత మాత్రం సరిపోదు అని రైతులను ఆదుకోకుంటే కొల్లాపూర్ శాసనసభ్యులు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును అధికారులను తిరుగనివ్వమని బిజెపి నేత కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి పార్టీ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు హెచ్చరించారు.
రైతుల పంట పొలాలకు సాగునీరు ను అందించాలని, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ రైతులకు అందించాలని, పంటలు ఎండి నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని రైతుల తరపున కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు రైతులతో బిజెపి పార్టీ నాయకులతో ప్రజలతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం నుండి శుక్రవారం రాత్రి కూడా దీక్ష చేస్తున్న శ్రీ భవాని దీక్షపరుడు ఎల్లేని సుధాకరరావును పోలీసులు శుక్రవారం రోజు అర్ధరాత్రి బలవంతము గా దీక్షను భగ్నము చేస్తూ దీక్ష చేస్తున్న సుధాకర్ రావు ను బిజెపి నాయకులను రైతులను పోలీసు వాహనాలలో ఎక్కించి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తన దీక్షను భగ్నము చేస్తూ తనను బలవంతముగా పోలీస్ వ్యానులో పోలీసులు ఎక్కించుకుంటున్నప్పుడు ఎల్లేని సుధాకర రావు
మాట్లాడుతూ తనను అరెస్టు చేసినట్లు కాదు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న రైతులకు ఎకరాకు 20వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని రైతుల పంట పొలాలకు సాగునీరును అందించాలని వ్యవసాయ రైతులకు నిరంతరం 24 గంటల విద్యుత్‌ను అందించాలని సుధాకర్ రావు డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం చేయకపోతే రైతులను బలవంతంగా అరెస్టు చేస్తున్న పోలీసు పాలకుల నిర్లక్ష్యాలకు నిరసనగా రైతులు ప్రజా ఉద్యమాలు ఉధృతం అవుతాయని సుధాకర్ రావు పాలకులను అధికారులను హెచ్చరించారు.
- రైతులకు సాగునీరును అందించకపోతే 24 గంటల విద్యుత్ సరఫరాను చేయకపోతే అలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించకపోతే కొల్లాపూర్ శాసనసభ్యులు, రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావును సంబంధిత శాఖ అధికారులను కొల్లాపూర్ లో తిరగనివ్వబొము అని పోలీసుల వ్యానులో ఎక్కుతున్న బిజెపి నేత ఎల్లేని సుధాకర్ రావు హెచ్చరించారు.