కరువు పీడిత ప్రాంతాల పరిశీలనకు
సిపిఐ రాష్ట్ర బృందం వస్తోంది.
(యస్.పి. మల్లికార్జున సాగర్)
కొల్లాపూర్, నవంబర్ 2, నేటి సత్యం.
కరువు పీడిత ప్రాంతాలను పరిశీలించడానికి నవంబర్ 4వ తేదీన సిపిఐ బృందం నాగర్ కర్నూల్ జిల్లా లో పర్యటించనున్నదని నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ తెలియజేశారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో సోమవారం ఆయన “నేటి సత్యం” విలేఖరి యస్.పి. మల్లికార్జున సాగర్ తో మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం లో అనావృష్టితో ఏర్పడ్డ మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా ప్రకటించి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వం 13 మండలాలనే కరువు మండలం లు గా ప్రకటించినది కానీ జిల్లా వ్యాప్తం గా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని అనావృష్టితో పంటలు ఎండిపోతున్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వర్షా బావ పరిస్థితుల మూలం గా నెలకొన్న కరువు పరిస్థితి క్షుణ్ణం గా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేసి నష్టపోయిన రైతులను ఆదుకోనమే విధము గా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చికరువు పీడిత ప్రాంతాలలో ప్రత్యేక ప్యాకేజీల ద్వారా రైతులను ప్రజలను ఆదుకునేలా కార్యక్రమాల రూపొందించుకోవడానికి ఈ కరువు పరిశీలన బృందం పర్యటన చేపట్టిందని ఫయాజ్ తెలియజేసారు.
నాగర్ కర్నూల్ జిల్లా లో పెద్ద ఎత్తున నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నప్పటికీ వాటిని సక్రమం గా వినియోగించు కోని ప్రభుత్వాల నిర్లక్ష్యాల తీరు వల్ల నేడు జిల్లా కరువు కౌగిలిలో నలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కరువు పరిశీలన బృందం లో సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బాల నరసింహ , సిపిఐ రాష్ట్ర నాయకులు , రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఇతర ప్రజా సంఘాల జిల్లా నాయకులు జిల్లా కార్యవర్గం కౌన్సిల్ సభ్యులందరు పాల్గొంటారని ఫయాజ్ తెలియజేశారు.