నేటి సత్యం/ మియాపూర్/ నవంబర్2
మియాపూర్ 100, 101 సర్వే నంబర్లలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదలకు పట్టాలిచ్చి చట్టబద్ధత కల్పించాలి
మిగులు భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి
యంసిపిఐ(యు) ఉమ్మడి మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ డిమాండ్
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, మియాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో దశాబ్దాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న స్టాలిన్ నగర్, ముజాఫర్ అహ్మద్ నగర్ బస్తీల పేదలకు ప్రభుత్వం వెంటనే ఇంటి పట్టాలు జారీ చేసి, వారి నివాసాలకు చట్టబద్ధత కల్పించాలని యంసిపిఐ(యు) ఉమ్మడి మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో గత నాలుగు దశాబ్దాలుగా ముజాఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్ బస్తీలలో ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారని తెలిపారు. తమ నివాసాలకు గత ప్రభుత్వాలు జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 505, జీవో ఎంఎస్ నెం. 166, జీవో ఎంఎస్ నెం. 58 కింద పట్టాలు జారీ చేసి చట్టబద్ధత కల్పించాలని ప్రజలు అనేకసార్లు ప్రభుత్వాలకు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు.
ఎం సి పి ఐ (యు) మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారు ఆనాడు అసెంబ్లీలో చర్చ పెట్టి త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మియాపూర్ భూముల సర్వే నంబర్ 100,101 కమిటీ ప్రభుత్వ భూమిని తెల్చడం జరిగింది.
గుర్తు చేశారు
తాజాగా 29-10-2026న సుప్రీంకోర్టు సర్వే నంబర్లు 100, 101లోని భూమి మొత్తం ప్రభుత్వానికి చెందినదిగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, స్టాలిన్ నగర్, ముజాఫర్ అహ్మద్ నగర్ బస్తీలలో దశాబ్దాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఇంటి పట్టాలు జారీ చేసి వారి నివాసాలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, సర్వే నంబర్లు 100, 101లో మిగులుగా ఉన్న భూమిని ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని కోరారు. మిగులు భూమిని ప్రైవేటు సంస్థలకు, పెట్టుబడిదారులకు విక్రయించకుండా ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ భూమిలో క్రింది ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
– డిగ్రీ కళాశాల
– జూనియర్ కళాశాల
– 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రి
– ఓపెన్ క్రీడా స్టేడియం
– మార్కెట్ యార్డ్
– స్మశాన వాటిక
– ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం
ప్రభుత్వ భూములను పేదల సంక్షేమం, విద్య, వైద్యం, క్రీడలు, ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఇస్లావత్ దశరథ్ నాయక్ స్పష్టం చేశారు.
కావున, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మియాపూర్ 100, 101 సర్వే నంబర్లలోని భూమిని ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని, దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు జారీ చేసి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.