Neti Satyam
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 12:11 pm Editor : Admin

రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించండి MLC

నేటి సత్యం /రంగారెడ్డి /నవంబర్ 4

*రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి*

*తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి*

*కేశంపేట మండలంలోని రైతుల పంట పొలాలను పరిశీలించిన సిపిఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం*

తీవ్రమైన వర్షాభావ కరువు పరిస్థితుల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో రైతులు వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్ర అవస్థలో ఉన్న రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ నెళికంటి సత్యం డిమాండ్ చేశాడు
బుధవారం నాడు రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి పాలమాకుల జంగయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్ర చారి మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్ రావు రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు ఓరుగంటి యాదయ్య కే రామస్వామి ఎం యాదిరెడ్డి.బుద్ధుల జంగయ్య టి రామకృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులు సామెడి శేఖర్ రెడ్డి ఎం శ్రీను నాయక్ పల్నాటి యాదయ్య ఎం ప్రభు లింగం.పి శివకుమార్ ఎం పవన్ చౌహాన్ ఆర్ యాదగిరి వడ్ల సత్యనారాయణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి చంద్ర బాబు తదితర పార్టీ నాయకులతో కలిసి ఈరోజు కేశంపేట మండలం ఇప్పలపల్లి వేముల గ్రామాలను సందర్శించి ఎండిపోయిన. పత్తి మరియు వడ్ల చేను మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న తీవ్రమైన కరువు చాయలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ద్వారా రాష్ట్రాన్ని మొత్తం కరువు ప్రాంతంగా ప్రకటించే విధంగా ఒత్తిడి తేవాలని దీనికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు
రాబోయే ఆరు నెలలు చాలా తీవ్రమైన గడ్డు పరిస్థితులు ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నందున ప్రభుత్వాలు సాగునీటి వసతి కరెంటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని ఆయన డిమాండ్ చేశారు
అలాగే ఈ ఆరు నెలలు ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదవాడికి 10 కిలోల బియ్యం పప్పు దినుసులు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశాడు
ఎండిపోయిన మొక్కజొన్న పంటకు 15 వేల చొప్పున వరి పంటకు 30 వేల చొప్పున పత్తికి 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు
రైతులు బ్యాంకులలో పంటలు వేసుకోవడానికి తీసుకున్న రుణాలను మొత్తాన్ని ఏకకాలంలో రద్దు చేయాలని ఆయన కోరారు
సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేసి ఈ జిల్లాకు సాగునీరు త్రాగునీరు అందించాల్సిన ప్రాజెక్టును కాలేశ్వరం ప్రాజెక్టుతో దీనిని బొంద పెట్టారని ఆయన విమర్శించారు
రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు కరువు పరిస్థితుల్లో ఉన్నందున మొత్తం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు