Neti Satyam
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 12:16 pm Editor : Admin

పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి. సీపీఐ

నేటి సత్యం/ తెలకపల్లి/ నవంబర్ 4
కరువు బారిన పడిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి

పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి.

సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి.

తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా వివిధ పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కరువు పరిశీలన బృందం పల్లా వెంకటరెడ్డి నాయకత్వంలో నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా తెలకపల్లి,బల్మూరు, ఉప్పునుంతల అచ్చంపేట అమ్రాబాద్ పదర మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు సాగు చేసి ఎండిపోయిన పంటలను సిపిఐ బృందం పరిశీలించింది.
ప్రధానంగా వర్షాభావ పరిస్థితుల్లో రైతులు సాగుచేసిన మొక్కజొన్న పత్తి పంటతోపాటు మిర్చి వివిధ రకాల ఖరీఫ్ పంటలు తీవ్రంగా ఎండిపోయి రైతులను నష్టపోయారని ఆయన అన్నారు.ఈ సందర్భంగా పంటల పరిస్థితిని, కరువు తీవ్రతను, రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను రైతులను అడిగి తెలుసుకుంది.

వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిని రైతులు పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని బృందం ఆవేదన వ్యక్తం చేసింది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు పంట నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
ప్రభుత్వాలు తక్షణమే కరువు మండలాలను గుర్తించి, పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎలాంటి జాప్యం లేకుండా న్యాయమైన నష్టపరిహారం అందించాలని సీపీఐ కరువు పరిశీలన బృందం డిమాండ్ చేసింది. అలాగే రైతులకు పంట నష్టపరిహారంతో పాటు రుణ ఉపశమనం, తదుపరి పంట సాగుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరింది.
రైతుల కష్టాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, రైతులకు న్యాయం జరిగే వరకు సీపీఐ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని బృందం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ సిపిఐ సమితి సభ్యులు కే కేశవులు గౌడ్ వి వెంకటయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి విజయ డు ఈ చంద్రమౌళి రైతు సంఘం జిల్లా కార్యదర్శి సూర్య శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు బి శ్రీనివాసులు సిపిఐ జిల్లా సమితి సభ్యులు బి రవీందర్ బండి లక్ష్మీపతి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మారేడు శివశంకర్ పి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి ప్రేమ్ కుమార్ టి మల్లేష్ పి గోపాల్ పరశురాం నరేందర్ రెడ్డి విష్ణు వంకేశ్వరం శ్రీనివాసులు కొత్త రామస్వామి ఏం ఆంజనేయులు శివకృష్ణ పి ధనంజయుడు రైతులు పర్వత్ రెడ్డి కృష్ణయ్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు