Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedచెరగని చిరునామా" సినారె "

చెరగని చిరునామా” సినారె “

నేటి సత్యం

తెలుగు సాహిత్య ప్రపంచానికి

చెరగని చిరునామా” సినారే”

కొల్లాపూర్, జూన్ 12 (నేటి సత్యం ప్రతినిధి).

తెలుగు సాహిత్య ప్రపంచానికి చెరగని చిరునామా సినారే అని, విశ్వంభర కావ్యం ద్వారా తెలంగాణ సాహిత్యం ను విశ్వవ్యాప్తము చేసిన సాహిత్య ప్రజ్ఞాని సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) అని

ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ అన్నారు.

వనపర్తి జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణం లో గురువారం ప్రముఖ కవి సాహితీవేత్త సింగిరెడ్డి నారాయణరెడ్డి

9వ వర్ధంతి ని మహానీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యం లో ఘనం గా నిర్వహించారు.

ఈ సందర్భం గా ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మశ్రీ పద్మభూషణ్ నంది అవార్డు గ్రహీత రాజ్యసభ మాజీ సభ్యులు తెలంగాణ ముద్దుబిడ్డ తెలుగు సాహిత్య ప్రపంచానికి చెరగని చిరునామా

విశ్వంభర కావ్యం తో తెలంగాణ సాహిత్యము ను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు,పద్యానికి పట్టం కట్టి గద్యానికి గజ్జ కట్టి గేయాలతో వియ్యం పొంది గజల్స్ తో విజిల్స్ వేయించి సినీ జగత్తులో పాటల ఊట లను పుట్టించి తెలుగు కవితా మాగాణం లో పూసిన ఎర్ర మందారమై మట్టి మనిషి పుట్టుకను విశ్వంబరం తో ఆవిష్కరించి,తెలుగు గజల్స్ ను తెలుగు భాష మాధుర్యాన్ని పద్యాలను సినీ గేయాలను రస భరితం గా ఆవిష్కరించి,సాహితీ సౌరభం అక్షరాలతో కవిత జలపాత ధార ను పంచిన వాడు వెన్నెల పాటల పూదోట జనానికి అందించి న జనం కవి సినారె అని ఆయన సినారే కు అక్షర నివాళులు అర్పించారు. నిజాం కళాశాల ఉస్మానియా కళాశాలలో ఆచార్యులుగా వేల మంది విద్యార్థులకు తెలుగు సాహిత్యాన్ని అందించిన గొప్ప వ్యక్తి బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, రామప్ప సంగీత నృత్య రూపకం, కలం సాక్షిగా కలిసినది నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు మనిషి చిలుక, మొదలైన రచనలు కావించారు 50 సంవత్సరాల పాటు సినీ రంగంలో వేల కొలది పాటలు రాసి ఎన్నో అవార్డులను పొందిన టువంటి జ్ఞాన శీలి సినారె అని ఆయన అన్నారు.

సాహిత్య కోవిదుడు నిరంతర కవి విశ్వంభర రచయిత మానవతామూర్తి ఆధునిక పరిజ్ఞానం కవి కవి పుంగవుడు సాహితీ శోధకుడు బహుభాషా రచయిత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత

జన కవి రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువదింపబడి న అనువాదమైన రచయిత జ్ఞానపీఠ పురస్కారం ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పద్మశ్రీ పద్మ భూషణ్ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ,పొట్టి శ్రీరాములు రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు విశ్వంభర, మనిషి చిలుక, ముఖాముఖి, భూగోళమంత మనిషి, నాగార్జున సాగరం, విశ్వనాథనాయకుడు మొదలగు రచనలు చేసి సమాజాన్ని మేల్కొలిపి నటువంటి కవి పుంగవుడు సినారె అని రాజారాం ప్రకాష్ అన్నారు.

.సినారె రాసిన ప్రపంచ పదులు పద్య గేయ కవితలు గజల్స్ అన్నింటితో గుండె గుండెలో నిలిచిపోయాయి అని , సినారె, జ్ఞాన యోగి కలం సాక్షిగా ముఖాముఖి రాసి కమ్మనైన పాటలు ఎన్నో జనానికి ఇచ్చి ఆయనను కలిసి నడిచే కలం నాగార్జునసాగర్ సాహిత్యం విశ్వనాథ నాయకుడు రామప్ప అజంత లో విలువలుండే రూపకాని

రమ్యం గా మలిచి నిరంతర నింగిలో వెలిగేటి సింగిడీ సింగిరెడ్డినారాయణరెడ్డి అని,తెలుగు భాషను కాపాడుకోవడానికి ప్రజలు కవులు కళాకారులు గాయకులు అందరు సినారెను స్ఫూర్తిగా తీసుకొని తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాష్ ఈ సందర్భం గా సాహితీ వ్యక్తులకు కవుల కు సాహిత్య అభిమానులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో కవి పండితుడు బూరోజు గిరి రాజా చారి వాల్మీకి సేవా సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్మండ్ల దేవన్న నాయుడు,

బోయ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు కావలి బాలస్వామి నాయుడు ,

కళాకారులు బాలేమియా, చింతకుంట కురుమయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు రమేష్ చారి, కిరణ్ చారి, సత్యం చారి ,

ఆర్యవైశ్య సంఘం నాయకులు శ్రీనివాసులు శెట్టి, శ్రీధర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments