*కార్మిక శాఖ కార్యాలయంలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి*
*కార్మిక సమస్యలను పరిష్కరించాలి*
*అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం (ఏ.ఐ.సి.టి.యు) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తుడం అనిల్ కుమార్*
తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక శాఖ కార్యాలయాలలో గల ఖాళీ పోస్టులను భర్తీ చేసి కార్మిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని *రాష్ట్ర సంయుక్త లేబర్ కమిషనర్ చంద్రశేఖర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది*
.ఈ సందర్భంగా ఏ.ఐ.సి.టి.యు రాష్ట్ర అధ్యక్షులు తుడం అనిల్ కుమార్ మాట్లాడుతూ…. కార్మిక శాఖ కార్యాలయాలలో వివిధ స్థాయిల పోస్టులు ఖాళీగా ఉండటం వలన కార్మికుల సమస్యల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించపడుట లేదు.కార్మికులు క్లైములు నెలలు గడుస్తున్న పరిష్కరించడం లేదు.రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలలో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసి కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నర్రప్రతాప్, రాష్ట్ర రాష్ట్ర సహాయ కార్యదర్శి కంచ వెంకన్న రాష్ట్ర కమిటీ సభ్యులు మేక మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు..