నీటి సత్యం 
ఆపరేషన్ తక్షణమే నిలిపివేయాలి
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్
. నేటి సత్యం.రంగారెడ్డి.జూన్ 14
దండకారణ్యం లో నల్లగుట్ట ప్రాంతంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు నిర్వహించాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు
శనివారం నాడు కొత్తూరు మండల కేంద్రంలో సిపిఐ గ్రామ శాఖ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై కార్మికులను కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు
భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతుందని దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలను కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న తరుణంలో కొత్తూరులో ఈ సమావేశం జరగడం మంచి పరిణామం అని ఆయన అన్నారు సిపిఐ పార్టీ ఉద్యమాలు పోరాటాల వల్ల దేశంలో రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరిగిందని ఆయన గుర్తు చేశారు
కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశంలో ప్రజలను ఆదుకునే నాధుడే లేడని అన్నారు పెట్టుబడిదారులు భూస్వాములు దళారీలు దోపిడి దారులు ప్రజలను అనునిత్యం దోచుకుంటున్నారని పాలకవర్గాలు దోపిడీదారుల పక్షాన నిలబడుతున్నారని ఆయన మండిపడ్డారు
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఆనుగంటి పర్వతాలు మాట్లాడుతూ కూడు గుడ్డ నీడ కోసమై పేద ప్రజల పక్షాన వందేళ్లుగా సిపిఐ పార్టీ పోరాడుతున్నదని ఆయన గుర్తు చేశారు
కమ్యూనిస్టులు అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం పేదల తరఫున పోరాడుతూనే ఉంటారని కొంతమంది బూర్జవ నాయకులు దోపిడీదారులు కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదని ప్రజల బాలు పలుకుతున్నారని అసలు కమ్యూనిస్టులు లేకపోతే ఈ సమాజానికి భవిష్యత్తు ఉందా అని ఆయన అన్నారు
కమ్యూనిస్టులు ఎప్పుడు ప్రజల ప్రయోజనాలు చూస్తారని సమాజ అభివృద్ధికి పాటుపడి ప్రాణాలు సైతం సమాజం కోసం ఇచ్చే వారే కమ్యూనిస్టులని ఆయన తెలిపారు
ఈ మహాసభలో సిపిఐ కొత్తూరు మండల కార్యదర్శి ఎండి షకిల్ కొత్తూరు కార్యదర్శి సంజీవ కుమార్ సహాయ కార్యదర్శి జంగయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డి ఎల్లయ్య అజ్మత్ అలీ దేవమ్మ రోజా తదితరులు పాల్గొన్నారు