నేటి సత్యం. మియాపూర్

*జూలై 9 వ తేదీన దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి*
*అఖిలభారత కార్మిక సంఘాల కేంద్రం (ఎ ఐ సి టి యు) రాష్ట్ర కమిటీ సమావేశం పిలుపు*
ది:-22-6-2025 రోజున అఖిలభారత కార్మిక సంఘాల కేంద్రం (ఎ ఐ సి టి యు) రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అద్యక్షుడు కామ్రేడ్ తుడుం అనిల్ కుమార్ గారి అధ్యక్షతన ఓంకార్ భవన్ బాగ్ లింగం పల్లి హైదరాబాదు లో జరిగింది.
తొలుత సమావేశం ఇటీవల మరణించిన ప్రపంచ రచయిత, ఆదివాసి హక్కుల కోసం విశేష రచనలు చేసిన గుగువా థియాంగో గారికి, ప్రముఖ కేరళ ట్రేడ్ యూనియన్ నాయకులు టి యన్ నారాయణన్ గారికి, ప్రపంచంలో వివిధ దేశాల్లో యుద్ధ దాడుల్లో మరణించిన సామాన్య పేద ప్రజలకు, ప్రకృతి వైపరీత్యాల లో మరణించిన ప్రజలకు సమావేశం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించనైనది.
ఈసందర్భంగా సమావేశం ను ఉద్దేశించి ఎ ఐ సి టి యు జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు నర్ర ప్రతాప్ గారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను ప్రైవేటీకరణ, సరళీకరణ నేపథ్యంలో నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం సవరణలు చేయడం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లు గా మార్చటం, 8 గంటల పని విదానాన్ని 12 గం లకు పెంచటం పక్క ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పని గంటల పెంపు కార్మిక విద్రోహం తప్ప మరోటి కాదని కార్మిక హక్కుల కోసం సాదించిన చట్టాలను రద్దు చేసే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా,నల్ల చట్టాలను రద్దు చేయాలని జూలై 9 వ తేదీన దేశ సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా కార్మిక ఉద్యమం తీవ్రం అవుతున్న సందర్భంగా ఎ ఐ సి టి యు ను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కదిలి పని చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర అద్యక్షుడు తుడుం అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ ఎ ఐ సి టి యు నాయకత్వం లో రాష్ట్రంలో ఉన్న అనేక కార్మిక సంఘాల ను సమన్వయం చేస్తూ ఐక్య కార్మిక ఉద్యమాలను నిర్మాణం చేయడం జరుగుతుంది అని ఈ నేపథ్యంలో కార్మిక ఉద్యమాలను బలోపేతం చేయడానికి గ్రామ,మండల కేంద్రము లలో ఎ ఐ సి టి యు అనుబంధ సంఘాల నిర్మాణం చేయాలని పాలక వర్గ దోపిడీ కి వ్యతిరేకంగా సమరశీల కార్మిక వర్గ పోరాటాల ను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశం లో ఎ ఐ సి టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కంచ వెంకన్న, సంఘం రాష్ట్ర కోశాధికారి కర్ర దానయ్య, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సుంచు జగదీశ్వర్, జి. శివాని, బి. యాదగిరి గార్లు పాల్గొన్నారు.
విప్లవ వందనాలతో
తుడుం అనిల్ కుమార్
ఎ ఐ సి టి యు రాష్ట్ర సెంటర్.