ఎన్నికల హామీలను అమలు చేయాలి.
విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి.
డి హెచ్ పి ఎస్ అనిల్ కుమార్
నేటి సత్యం. హైదరాబాద్. జూన్ 23
హైదరాబాదు: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని,ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశం సోమవారం రోజున కె యేసు రత్నం అధ్యక్షతన హిమాయత్ నగర్, రాజ్ బౌద్ధూర్ గౌరు హాల్లో జరిగింది.దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారు పాక అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కోరారు. దళితులకు సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిపివేశారని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను నిర్వీర్యం చేశారని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లబ్ధిదారునికి కూడా రుణం ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఇండస్ట్రియల్ ద్వారా ఇచ్చే రుణాలను నిలిపివేశారని గత నాలుగు సంవత్సరాలుగా సబ్సిడీలు రావడం లేదని అన్నారు. నిరుద్యోగ యువకులకు సబ్సిడీ ద్వారా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లులేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాది పనులు పేదలకు దొరకడం లేదని సరియగు కూలీ ఇవ్వడం లేదని కోరిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్లో సమస్యలపై ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందుబాటులో లేదని ప్రభుత్వ దవాఖానాలలో సర్వేలు నిర్వహించి పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడానికి పోరాడుతామని తెలిపారు. డి హెచ్ పి ఎస్ రాష్ట్ర రెండవ మహాసభలను ఆనివారణ కారణాల చేత తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు.రాష్ట్ర అధ్యక్షులు కే యేసు రత్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో దళితులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ గురుకులాలను రద్దు చేయడానికి కుట్రలు చేస్తుందని అన్నారు. ప్రైవేటు పాఠశాల విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఏ రాజు కుమార్, జే కుమార్ స్వామి, కే సహదేవ్, వై ఉషశ్రీ, టి రామకృష్ణ, కే రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాభివందనాలతో.