*సీజన్ వ్యాధులతో జర భద్రం..*
*జిల్లా ఉపవైద్యాధికారి డా.విజయలక్ష్మి*
*సీజన్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం*
*హాజరైన మండల ప్రత్యేక అధికారి రామారావు..*
*పాల్గొన్న ఎంపీడీవో బన్సీలాల్*
వర్షాకాలంలో వివిధ రూపాల్లో వచ్చే సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉపవైద్యాధికారి డా.విజయలక్ష్మి సూచించారు. మండల ప్రత్యేక అధికారి రామారావు ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సీజన్ వ్యాధుల నివారణ, వనమహోత్సవం, వ్యవసాయ శాఖ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గన్యా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి జనం తలనొప్పి, జ్వరం, ఒంటి నొప్పుల వంటివి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.ప్రత్యేక అధికారి రామారావు మాట్లాడుతూ సీజన్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామాలలో మురికి నీరు నిలవకుండా, దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్య పారిశుభ్ర కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. ఎంపీడీవో బన్సీలాల్ మాట్లాడుతూ గ్రామ కార్యదర్శులు దోమల నివారణలో కీలకపాత్ర పోషించాలన్నారు. దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు తెలియజేశారు. డాక్టర్ స్రవంతి, డాక్టర్ రాఘవేందర్, వ్యవసాయ శాఖ అధికారి నిశాంత్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.