Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedమహనీయుల విగ్రహాలకు జర్నలిస్టుల వినతి పత్రాలు..?

మహనీయుల విగ్రహాలకు జర్నలిస్టుల వినతి పత్రాలు..?

“మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకా” లో “మహ నీయుల విగ్రహాలకు జర్నలిస్టుల వినతి పత్రాలు”…

కొల్లాపూర్ జూన్ 30 (నేటి సత్యం ప్రతినిధి: యస్. పి. మల్లికార్జున సాగర్)

కొల్లాపూర్ లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని గత ఆరు రోజులుగా కొల్లాపూర్ లోని జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కండ్లుండి కబోదుల్లా చూడలేని, మాట్లాడేందుకు అవకాశాలున్నా మాట్లాడేందుకు రాని పాలకులకు, ప్రజా ప్రతినిధులకు మీరైనా కనువిప్పు కలగజేసి జర్నలిస్టుల సమస్యలను తీర్చేందుకు వారు కృషి చేసే విధం గా వారికి మంచి జ్ఞానం కలగజేయండి అంటు దీక్షలు చేస్తున్న జర్నలిస్టులు కొల్లాపూర్ లోని మహనీయుల విగ్రహాలకు వినతి పత్రాలను అందజేశారు.

. జర్నలిస్టుల దీర్ఘ కాలికమైన ఇండ్ల సమస్యలను పాలకులు, ప్రజా ప్రతినిధులు పట్టించు కొని నిర్లక్ష్యాలను నిరసిస్తూ కొల్లాపూర్ లో రిలే నిరాహర దీక్షలు చేస్తున్న టి డబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు యస్. రామచంద్రయ్య, తాలూకా కన్వీనర్ జలకం మద్దిలేటి, జిల్లా నాయకులు యస్.పి. మల్లికార్జున సాగర్, సీనియర్ జర్నలిస్టులు బి. కురుమయ్య, సిపి నాయుడు, కారంగి గోవిందు, రమణా జి రావు, పేరుమల్ల స్వామి, మల్లేష్, పరుశురాం, తరుణ్, జల్లాపూర్ సురేందర్, కేశవులు తదితరులు దీక్షా శిబిరం నుండి కొల్లాపూర్ పట్టణ వీధుల్లో సోమవారం రోజు ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, పక్కా గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయాలు అందించాలని, అక్రిడేషన్ కార్డులను నూతనం గా మంజూరు చేయాలని, జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసేందుకు, అలాగే రైల్వేలలో జర్నలిస్టులు ఉచితం గా ప్రయాణం చేసేందుకు రైల్వే పాసులను మంజూరు చేయాలని, జర్నలిస్టు కుటుంబ సభ్యులకు జర్నలిస్టులకు కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితం గా వైద్య సేవలు అందించేందుకు అవకాశాలు కల్పించాలని, కొల్లాపూర్ లో ప్రభుత్వ పరం గా ప్రెస్ క్లబ్ ను నిర్మించాలని జర్నలిస్టులు నినాదాలు చేశారు.

తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలంటూ గత ఆరు రోజులుగా కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి ఆరవ రోజుకు చేరుకున్నా పట్టించుకోని పాలకులకు ప్రజాప్రతినిధులకు కనువిప్పు కలుగజేస్తూ వారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసే విధం గా వారికి మంచి సద్భుద్దిని కలగజేయాలని జర్నలిస్టులు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లోని భారత దేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ జగ్జీవన్ రామ్, బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీజీ , అలాగే జ్యోతిరావు పూలే మహనీయుల విగ్రహాలకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను సోమవారం రోజు జర్నలిస్టులు అందజేశారు.

ఈ సందర్భం గా టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు రామచందర్, టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ జలకం మద్దిలేటి, నాగర్ కర్నూలు జిల్లా నాయకులు యస్.పి. మల్లికార్జున సాగర్ లు మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గం లోనే ఇండ్ల స్థలాల కోసం శాంతి యుతం గా జర్నలిస్టులు గత ఆరు రోజులుగా దీక్షలు చేస్తున్నా మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుతూ కూడా పట్టించు కోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించేంతవరకు , జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేంతవరకు రిలే నిరాహార దీక్షలను ఇలాగే కొనసాగిస్తామని వారు తెలియజేశారు.

కొల్లాపూర్ లో జర్నలిస్టుల సమస్య ఈ రోజు ది కాదని మూడు దశాబ్దాలకు పైగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పై ఆశ చూపడం కొన్నిసార్లు ప్రోసిడింగ్ కాగితాలు ఇస్తూ పాలకులు జర్నలిస్టులను మోసం చేస్తూ కాలం గడుపుతున్నారని జర్నలిస్టులు విమర్శించారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మూడు పర్యాయా లు మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు జర్నలిస్టులను ఇండ్ల స్థలాలు ఇస్తానని ఇండ్ల నిర్మాణాలకు రుణాలు ఇప్పిస్తానని చెబుతూ కాలం గడుపుతూ జర్నలిస్టులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

ప్రజలకు ప్రభుత్వానికి వారదులు గా పనిచేస్తున్న జర్నలిస్టులకు పాలకులు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు.

రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తలుచుకుంటే ఒక రోజులో కొల్లాపూర్ నియోజక వర్గం లోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కారం చేయొచ్చని అయినా మంత్రులు జూపల్లి కృష్ణారావు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయకుండా పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు విమర్శించారు.

ఇప్పటికైనా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లోని జర్నలిస్టులకు, అలాగే కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని కోడేరు, పానగల్, పెద్దకొత్తపల్లి , వీపనగండ్ల, పెంట్లవెల్లి మండలాలలోని జర్నలిస్టుల కు ఇండ్ల నిర్మాణ స్థలాలను మంజూరు చేస్తూ, చిన్నంబావి మండల కేంద్రం లో అసంపూర్తి గా ఉన్న జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయించాలని జర్నలిస్టులు మంత్రి జూపల్లి కృష్ణారావు ను డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కారం చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు మంత్రి జూపల్లి కృష్ణారావు ను , ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో కొల్లాపూర్ నియోజక వర్గము లోని వివిధ మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments