Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedపేద రైతు జోలికొస్తే ఊరుకోం షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

పేద రైతు జోలికొస్తే ఊరుకోం షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

*పేద రైతుల జోలికొస్తే ఊరుకొం..*

*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

*ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన చిలకమర్రి రైతులు, గ్రామస్తులు*

*ఎమ్మెల్యే శంకర్, మీడియా, రెవిన్యూ యంత్రాంగం చొరవతో న్యాయం జరిగిందని వెల్లడి*

*ఇలాంటి మోసాలపై కఠిన చర్యలు*

నేటి సత్యం. షాద్నగర్. జులై 1

షాద్ నగర్ నియోజకవర్గంలో

నిరుపేద రైతులను మోసం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ “వీర్లపల్లి శంకర్” హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన కొత్తపల్లి నరసింహారెడ్డి, వినోద రైతులు కలుసుకున్నారు. మోసపూరిత పద్ధతిలో తమ పేరిట ఉన్న భూములను గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి అతని తండ్రి సుభాన్ రెడ్డి మరికొందరు అక్రమ పద్ధతులతో పట్టా మార్పిడి చేయించడం తదితర వ్యవహారాల్లో మీడియా కథనాలపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, స్థానిక ఆర్డిఓ ఎన్ఆర్ సరిత, ఫరూక్ నగర్ తహసిల్దార్ పార్థసారథి తదితరులు బాధితులకు సహకారం అందించే విధంగా పట్టా మార్పిడి విషయంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తో మాట్లాడి మోసానికి గురైన కొత్తపల్లి వినోద కొత్తపల్లి నరసింహారెడ్డి భూమిని తిరిగి వారికి వచ్చే విధంగా అధికారులు శ్రీకారం చుట్టడంతో సదరు రైతులు ఎమ్మెల్యేను కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. వ్యవహారాలు కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ స్పందించి ఎమ్మెల్యే శంకర్ చర్చలు సఫలీకృతమై పేద రైతుల భూమి ఇతరులకు రిజిస్ట్రేషన్ అయిన క్రమంలో దానిని రద్దు చేయడం పట్ల చిలకమర్రి గ్రామ రైతు కాంగ్రెస్ నాయకుడు రవీందర్ రెడ్డి తదితరులు గ్రామస్తుల తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు చేసిన మేలు జీవితంలో వారు మర్చిపోలేని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకర్ ఆప్యాయతగా సదరు రైతులను పలకరించి ధైర్యం చెప్పారు. ఎవరికి ఏ అన్యాయం జరగనివ్వనని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిరుపేద రైతాంగాన్ని మోసం చేస్తే సహించానని ఈ విషయంలో మోసానికి పాల్పడ్డ ఎంతటి వారైనా కఠినంగా చర్యలు ఎదుర్కొక తప్పదని పేర్కొన్నారు. చట్టం తన పని చేసుకోపోతుందని ఎవరిని ఉపేక్షించమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments