*నాగర్ కర్నూల్ జిల్లాలో చరిత్రాత్మక ఘట్టం – ఆలేరు గ్రామంలో మొట్టమొదటి అమర వీరుల స్థూపం ఆవిష్కరణ*
*ప్రజల ఉత్సాహం మధ్య ఘనంగా నిర్వహణ*
నేటి సత్యం.ఆలేరు హాయ్ 7
నాగర్ కర్నూల్ ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో నాగర్ కర్నూల్ జిల్లాలోనే మొట్టమొదటి అమర వీరుల స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ర్ట ఆబ్కారీ శాఖ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, శాసన మండలి సభ్యులు శ్రీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి గారు మరియు ప్రొ. కోదండరామ్ గారు, అచ్చంపేట శాసన సభ్యులు శ్రీ చిక్కుడు వంశీ కృష్ణ గారు, కల్వకుర్తి శాసన సభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, గద్దర్ తనయురాలు వెన్నెల గారు మరియు వివిధ హోదాలలో ఉన్న ఛైర్మన్ లు పాల్గొన్నారు .
స్థూపం చుట్టూ దేశభక్తి వాతావరణం నెలకొంది. జాతీయ జెండా రంగుల్లో పూలతో అలంకరించిన స్థూపం ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. డా. రాజేష్ రెడ్డి గారు తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, గ్రామస్తులు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొని అమర వీరుల సేవలను స్మరించుకున్నారు.
*ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ*
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు అంకితంగా నిర్మించిన ఈ స్థూపం, వారి త్యాగాలను తరతరాల పాటు గుర్తు చేస్తుంది.
అమరుల త్యాగాల ఫలితంగా మనం స్వేచ్ఛా గాలిని పీలుస్తున్నాం – వారి పేర్లు చిరస్మరణీయంగా ఉండాలి”
ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు,జిల్లా స్థాయి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
