*• బోడుప్పల్ దళిత కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి గారి నిర్ణయం*
• *ల్యాండ్ పూలింగ్ ద్వారా అర్దిక ప్రగతికి మార్గం సుగమం*
• *ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కలెక్టర్ కు ఉత్తర్వులు జారీ*
*ఫలించిన వజ్రెష్ యాదవ్ వ్యూహం*
ఎండ్ల తరబడి నిరీక్షిస్తున్న బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 60 దళితుల కుటుంబాల్లో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నిర్ణయంతో వెలుగులు నిండాయి. బోడుప్పల్ సర్వే నెంబరు 63/2 నుండి 63/25 లోని 336 ఎకరలా భూమి నాడు సాగు చేసుకుని జీవనం సాధించేందుకు నాడు ఇందిరమ్మ గారు భూమి పంపిణీ చేశారు. నేడు కాలం మారింది గ్రామం నగరంగా రూపాంతరం చెందింది. వ్యవసాయం చేసే వీలు లేదు కావునా సదు దళితుల భూమి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎకరానికి 600 గజాల చొప్పున ఇచ్చేలా సర్కారు చెప్పడంతో అ రైతులు స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారానే మా రైతుల కుటుంబాలు అర్దిక ప్రగతి సాధిస్తాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ చేసిన కృషి మరువలేనిదని ఆయనను కొనియాడారు.మంగళవారం నాడు భూ యజమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి ని కలిసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరో పదిహేను రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన అదేశాల మేరకు ప్రతిరైతకు భూ యాజమాన్యం హక్కులకు సంబంధించిన పత్రాలు అందిస్తామని హమీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్,మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాపోలు ఉపేందర్, మాజీ కార్పొరేటర్ చీరల నరసింహ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చీరాల జంగయ్య, దానగళ్ల యాదగిరి, రాపోలు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
