*గద్వాల్ డిపో వారు వెంటనే నారాయణపేట మరియు ఇతర ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేయాలి*
*ఉచిత ప్రయాణ బస్సులు పెట్టడం ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు*
*బస్సులు నడవాల్సింది ప్రయాణికుల కోసమా ప్రభుత్వాన్నేలే ప్రభుత్వ ఆర్భాటాల కోసమా*
*గద్వాల్ టు నారాయణపేట కు బస్సులు లేక అవస్థలు పడుతున్న నేటి ప్రయాణికులు*
గద్వాల డిపో నుండి పల్లెలకు బస్సు లేదు నారాయణపేట బస్సు ఉందా అని అడగగా బస్సు డిపో వారు ఏ బస్సు లేవు పొండి అన్ని హైదరాబాద్ మీటింగ్ కు పోయాయి అని సమాధానం చెబుతున్నారు అని ప్రయాణికులు వాపోతున్నారు.మరి మేము నారాయణపేటకు వెళ్లాల్సి ఉంది ఎలా సార్ అంటే అక్కడ పోయి ఆటోలు ఏమైనా మాట్లాడుకోండి అని సమాధానం ఇస్తున్నారు. సార్ ఐజకు అన్ని బస్సులు పోతున్నాయి కదా అందులో ఒక రెండు బస్సులు డైవర్ట్ చేయొచ్చు కదా అని ప్రయాణికులుగా అడిగాము కానీ అవి ప్రైవేట్ బస్సులు అండి అవి మాకు సంబంధం లేదు అని బస్సు డిపో మేనేజ్మెంట్ వారు సమాధానం ఇస్తున్నారు. పల్లెలకు ఏ బస్సు లేవన్నప్పుడు మరి పేద మనిషి ఎలా వెళ్లాలి ఎమర్జెన్సీ ఉంటే ఏంది పరిస్థితి అని ప్రజలు ప్రయాణికులు వాపోతున్నారు. మీటింగ్ ల కోసం నాయకులే ఆటోలు కార్లు అద్దెకు తీసుకొని వెళ్లొచ్చు కదా ప్రయాణికులను ఇబ్బంది పెట్టి సభలకు బస్సులు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసం అని ప్రయాణికులు వాపోతూ ముందే వర్షకాలం అంటూ వాపోతున్నారు.