Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedప్రైవేటు విద్యారంగంపై ఉన్న ప్రేమ ప్రభుత్వ విద్య పైన ఉండదు?

ప్రైవేటు విద్యారంగంపై ఉన్న ప్రేమ ప్రభుత్వ విద్య పైన ఉండదు?

నేటి సత్యం జూలై 23

హైదరాబాద్

*ప్రైవేటు విద్యారంగంపై ఉన్న ప్రేమ ప్రభుత్వ విద్య పైన ఉండదా?*

*ఫీజుల చట్టం అమలు ఉండదు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ ఉండదు*

*తెలంగాణలో విద్యాశాఖను గాలికి వదిలివేసిన రేవంత్, ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్న విద్యాశాఖ మంత్రిని కేటాయించారా?*

*మధ్యాహ్న భోజనానికి నిధులు ఇవ్వరు, మౌలిక సదుపాయాలు లేవు, గురుకులాలలో ఒరిస్సా ఘటనలు జరుగుతున్న ప్రభుత్వ స్పందన కరువు*,
* *పెండింగ్ ఫీజులు తక్షణమే విడుదల చేయాలి*
* *వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం* *సమస్యలు పరిష్కారనీకై చేపట్టిన చలో సచివాలయం ముట్టడి*
* *ఉద్రికత విద్యార్థి నేతల అక్రమ అరెస్టులు*
* *అక్రమ అరెస్టులను నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్ధం పిలుపు*

హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగ సమస్యలు, ప్రైవేటు కార్పోరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ కై ప్రత్యేక చట్టం చేయాలని, పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల నిర్వహించిన పాఠశాలల ఇంటర్ కళాశాల బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా ఈ సమస్యలు పరిష్కారానికి నిర్వహించిన చలో సచివాలయం ఉద్రిక్తత కు దారితీసింది.సమస్యలు పరిష్కారానికి లోయర్ ట్యాంక్ బండ్ నుండి ప్రదర్శనగా బయలుదేరిన విద్యార్థి నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పిడి గుద్దులతో బలవంతంగా,అమ్మాయిల సైతం చూడకుండా లాక్కుని పోలీసులు వ్యాన్లలో ఎక్కించి ముషీరాబాద్ బోయిన్ పల్లి లో పాటు నగరంలో పలు పోలీస్ స్టేషన్ లో తరలించారు ఈ సందర్భంగా విద్యార్థి నేతలకు పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది వాగ్దానం జరిగింది. ఈ సందర్భంగా *వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు పుట్ట లక్ష్మణ్, కె.మణికంఠ రెడ్డి (ఏ.ఐ.ఎస్.ఎఫ్) టీ. నాగరాజ్ ,రజనీకాంత్ (ఎస్.ఎఫ్.ఐ) సాయిబోల అనిల్ (పి.డి.ఎస్.యు) పొడపంగి నాగరాజు ,(పి.డి.ఎస్.యు), గడ్డం నాగార్జున, పల్లె మురళి (ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్) హకీం నవీద్ (ఏ.ఐ.ఎస్.బి) నితీష్(ఏ ఐ డి ఎస్ ఓ), మనే కుమార్ (ఏ.ఐ.పీ.ఎస్.యు), మొగిలి వెంకట రేడ్డి (పి.డి.ఎస్. యు)లు మాట్లాడారు.*

* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఫల్యాల ఎండగడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు అవుతున్న విద్యారంగానికి ఇచ్చిన హామీల నెరవేర్చలేదు. రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని పరోక్షంగా అమలు చేస్తూ ఈ రాష్ట్ర విద్యా రంగాన్ని బిజెపి చేతిలోకి పెట్టే కుట్రలు చేస్తుంది. రాష్ట్రంలో 2253ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం లేదు, 1500 పైగా పాఠశాలలో టాయిలెట్స్ లేవు, 28 వేల పైగా పాఠశాలలో కంప్యూటర్స్ లేవు, ఇంగ్లీష్ మీడియం ఇతర రాష్ట్రాల మీడియాలో మాదిరి కన్నడ ఉర్దూ మలయాళం చదువుతున్న విద్యార్థులకు రావాల్సిన పాఠ్యపుస్తకాలు అందలేదు రెండు జతలు యూనిఫామ్స్ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక జత మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసి నారూ. ఇంకా 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ పథకం తీసుకొచ్చిన దానిని అమలు చేయడం లేదు, మధ్యాహ్నం భోజనానికి పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు ఇవ్వాల్సిన ఉన్న వాటిని పెంచడం లేదు, లైబ్రరీలు, త్రాగునీరు , ప్రహరీ గోడలు, టాయిలెట్స్ అదనపు గదులకు నిధులు ఇవ్వలేదు, పాఠశాల విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో నెట్టి వేయబడింది.
* ప్రైవేటు,కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీకి అడ్డు అదుపు లేదు ఎల్కేజీ నుండి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. అడ్మిషన్లు పేరుతో డొనేషన్లు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అమ్మతో లక్షల రూపాయల దందా కొనసాగిస్తున్న ప్రభుత్వం నియంత్రం లేదు. రాష్ట్రంలో తక్షణమే ఫీజు నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గురుకులల్లో కనీసం సౌకర్యాలు లేవు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతవరుసగా 93 మంది చనిపోయినారు. దీనికి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదు గురుకులల్లో ఆ శాస్త్రీయంగా తీసుకొని వచ్చిన సమయపాలన మార్చాలి అద్దెభవనలు నడుస్తున్న 662 గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం.
* రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలోను తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. తక్షణమే ఫీజు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇంటర్ విద్యాలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ లెక్చరర్స్ పోస్టులు భర్తీ చేయాలి పాఠశాల విద్యా లో ఖాళీగా ఉన్న ఎంఈఓ డీఈవో పోస్టులను తక్షణమే భర్తీచేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
* తెలంగాణ రాష్ట్రంలో పరీక్షంగా NEP 2020 ను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి,NEP 2020 అమలు చేయకుండా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తుంది. విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించి బడి బస్సులు నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
* ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే భవిష్యత్తులో తీవ్ర ప్రతిఘటనలు రేవంత్ ప్రభుత్వం ఎదురుకోవాల్సి వస్తుందని అన్నారు.
* ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరే విద్యా శాఖ ఉన్నప్పటికీ కనీసం ఒక రివ్యూ కూడా చేయలేదని కనీసం ఒక విద్యా సంస్థను కూడా సందర్శనలేదని ప్రభుత్వ విద్యారంగా బలోపేతం కాకుండా ప్రైవేటు విద్యాసంస్థలను సందర్శిస్తున్నారని విమర్శించారు.
* బందు సందర్భంగా మంచిర్యాల భువనగిరి కొత్తగూడెం జిల్లాలో అక్రమంగా అరెస్టు లు చేశారు. సచివాలయానికి వచ్చి మంత్రులకు సమస్యలు చెప్పాలని వస్తున్న విద్యార్థి నాయకులను అక్రమ అరెస్టు చేశారు. *ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయాలని విద్యార్థి సంఘలు పిలుపునిచ్చాయి*
* ఈ సచివాలయం కార్యక్రమంలో ఎం మమత, డి కిరణ్ ,అశోక్ రెడ్డి, రమ్య ,నాగేందర్ ,స్టాలిన్, రజనీకాంత్, కైలాస్ (ఎస్.ఎఫ్.ఐ), చైతన్య ,రెహమాన్, అనిల్ కుమార్ ,హుస్సేన్ ,అరుణ్, తేజ ,నితీష్ (ఏ.ఐ.ఎస్.ఎఫ్) హరీష్ ,నాగరాజు, సాయి ,ప్రసాద్ ,బీమ్ సేన్,సోనీ ,నవిత , క్రాంతి (పి.డి.ఎస్.యు), పి. మహేష్, శ్రీను ,శ్యామ్ ,గౌతమ్ (పి.డి.ఎస్. యు) శ్రీకాంత్ ,ప్రణయ్ ,వరుణ్(ఏ.ఐ. ఎఫ్.డి.ఎస్) నాగరాజు ,శశాంక్, సిద్దు(ఏ.ఐ.డి.ఎస్.ఓ) సూర్య కిరణ్ (ఏ.ఐ.ఎస్.బి) గణేష్,సైదులు, వంశీ, రాజు (పి.డి.ఎస్.యు) మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments