నేటి సత్యం వనపర్తి జులై 23
*మత రాజకీయం దేశ ప్రగతి విఘాతం.*
*రాజ్యాంగం జోలికొస్తే మోడీ సర్కార్ కి పుట్టగతులు ఉండవు.*
*-ఎం.బాల నరసింహ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.*
*కదిలిన ఎర్రదండు, ప్రజా ప్రదర్శన,ఎరుపెక్కిన ఆత్మకూర్.*
*ఆత్మకూర్ లో సిపిఐ జిల్లా మూడో మహాసభలు ప్రారంభం.*
నేటి సత్యం ఆత్మకూర్. జూలై 23
మత విద్వేష రాజకీయాలు దేశ ప్రగతికి విఘాతామని, భారత రాజ్యాంగంలో లౌకిక,ప్రజాస్వామ్య, సోషలిస్టు అంశాలు తొలగింపు చేస్తామంటూ రాజ్యాంగ పీఠికకు ఉరితాళ్ళు పేను తే మోడీ సర్కార్ కు పుట్టగతులు ఉండవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాల నరసింహ తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వనపర్తి జిల్లా మూడవ మహాసభలు ఘనంగా ప్రారంభమైనవి. ముందుగా ఆత్మకూర్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి భారీ ప్రజా ప్రదర్శన ప్రారంభమై పాత కరెంట్ ఆఫీస్ గాంధీ చౌరస్తా బస్టాండ్ మీదుగా ఎం.జి గార్డెన్ వరకు సాగిన ఎర్ర దండు కవాతు, ఎర్రజెండాలతో ఎరుపెక్కి ఆత్మకూరు పట్టణం అరుణమయం అయ్యింది. ప్రజా ప్రదర్శనలో ప్రజానాట్యమండలి కళాకారుల గొల్ల సుద్దులు డప్పుల దరువులు నృత్యాలతో మార్మోగింది.అనంతరం సిపిఐ వనపర్తి జిల్లా మూడో మహాసభలు మహాసభల బహిరంగ సభ సిపిఐ జిల్లా కార్యదర్శి కె.విజయ రాములు అధ్యక్షతన జరిగింది.
ఈ మహాసభలకు ముఖ్య అతిథులు హాజరైన ఎం.బాల నరసింహ మాట్లాడుతూ:-కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నయా ఉదార వాద దివాలా కోరు విధానాలను అనుసరిస్తూ దేశ సంపదను ఆర్థిక నేరగాలకు దోచి పెడుతూ లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పీఠికకు బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు చర్యల వలన ప్రమాదం దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణల పేరుతో భిన్నత్వంలో ఏకత్వం గల గొప్ప సాంప్రదాయక దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు ఆజ్యం పోస్తు సంఘ్ పరివార్ శక్తుల ఎజెండాను పాలనరంగంలో చొప్పిస్తున్నారని అన్నారు. ఉగ్రవాద పాకిస్తాన్ ముష్కరుల పై ట్రంపు ఆదేశాలతో యుద్ధం ఆపిన మోడీ దేశంలో ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులను అంతం చేసే కుట్రలు బాధాకరమని అన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడు జనం పక్షాన నిలబడతారని కమ్యూనిస్టులను లేకుండా చేస్తామని పగటి కలలు కంటున్నారని సూర్య,చంద్రులు ఉన్నంతవరకు దోపిడి కొనసాగినంత కాలం ఎర్ర జెండాకు మరణం లేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా తక్షణమే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయ రాములు మాట్లాడుతూ:-తాటిత పీడిత జనం పక్షాన పోరాడుతున్న సిపిఐ పార్టీకి 100 సంవత్సరాలు నిండాయని అన్నారు. పేదల సమస్యలపై రాజీలేని పోరాటాలు నడిపేందుకే గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు మహాసభలను ఏర్పాటు చేసుకొని పార్టీని బలమైన నిర్మాణం చేసుకుంటూనే ప్రజా సమస్యలపై ప్రజాసంఘాల ఉదృత పోరాటాలు నిర్వహించేందుకు మహాసభలలో చర్చలు జరుపుతున్నామని అన్నారు.
*ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కే. విజయరాములు, సిపిఐ జిల్లా నాయకులు కళావతమ్మ,శ్రీహరి,శ్రీరామ్,మోష,అబ్రహం, నరసింహ శెట్టి, లక్ష్మీనారాయణ శెట్టి, గోపాలకృష్ణ,జే. చంద్రయ్య,భాస్కర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతూబ్,మంకలి శాంతయ్య,మాషప్ప, కురుమన్న, ప్రజా కవి జనజ్వాల, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మాజీ సభ్యులు గంధం నాగరాజు, శ్యాంసుందర్, రవీందర్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి గీతమ్మ,నర్సింహులు, నాగరాజు,ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు పి.సురేష్, లక్ష్మీనారాయణ, సౌలు, ఇజ్రాయిల్,రవి, నిసార్, గాయని శ్యామల తదితరులు పాల్గొన్నారు.*


