నేటి సత్యం. మొయినాబాద్. జూలై 23
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం యెన్కేపల్లి గ్రామం సర్వే నెంబర్ 180 లో 99 ఎకరాల 14 గుంటల భూమిని గోశాల నిర్మాణం కోసం అని రాష్ట్ర ప్రభుత్వం దళిత రైతుల నుంచి సన్న కారు రైతుల నుంచి భూమిని బలవంతంగా లాక్కోవటానికి జరుగుతున్న ప్రయత్నాల పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం విచారం వ్యక్తం చేసింది.
యెన్కేపల్లి గ్రామ రైతులు 16 రోజులుగా మా భూములో 75 సంవత్సరాల నుంచి సాగు చేసుకుని బ్రతుకుతున్నామని మా బ్రతుకు తెరువును దెబ్బతీయొద్దని కోరుతూ ఉదయము రాత్రి ధర్నా నిర్వహిస్తున్నారు. జులై ఏడవ తారీఖున జెసిబి ని ఆపినందుకు దళిత సన్న కారు రైతులపై పోలీసు విరుచక పడింది లాఠీచార్జి చేసింది ఇద్దరు మహిళల చేతులు విరిగిపోయాయి. జూలై 15వ తారీకున నేషనల్ హైవే పక్కన ఎమ్మార్వో ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే పోలీసు లాఠీచార్జి చేసింది ఈరోజు కూడా వందల మంది పోలీసులను మోహరించి రైతులు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమాన్ని విచ్చిన్నం చేయడానికి దౌర్జన్యంగా వారి భూములలో జెసిబి తో చదును చేయటానికి ఆర్డిఓ ఇతర ప్రభుత్వ అధికారులు ఆందోళన చేస్తున్న రైతులను బయటికి వెళ్లగొట్టడానికి వాగ్వాదానికి దిగింది.
సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారి దృష్టికి ఫోన్ ద్వారా విషమంతా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు వారు స్పందిస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తానని రెండు మూడు రోజులు ఎలాంటి జెసిబి పనులు చేయకుండా ఉండాలని కోరారు. బహు కొద్దిమంది రైతులు అంగీకరించి 300 గజాలకు పట్టాలు తీసుకున్నారని ఆ భూమిలో చదును చేస్తాము అన్న పేరుతో జెసిబి ని తీసుకొని ఆర్డిఓ గారు ఫీల్డ్ కు వెళ్లిపోయారు అడ్డగించటానికి మహిళలు సమాయత్తమయ్యారు. కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఆగారు.
జాతీయ ఎస్సీ కమిషన్కు కూడా దళిత రైతులు విన్నవించుకున్నారు. ఈరోజు పశ్య పద్మ కూడా జాతీయ ఎస్సీ కమిషన్ గారికి విషయం తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఎస్సీ కమిషన్ దళిత రైతులకు సామాన్య రైతులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ధర్నా నిర్వహిస్తున్న మహిళలను ఆందోళనకారులను కలిసి పూర్తిగా వివరాలు తెలుసుకొని వారి న్యాయబద్ధమైన డిమాండ్ నెరవేరే దాకా వారికి అండగా ఉంటాము అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు పశ్య పద్మ, ప్రభు లింగం, దేవ భక్తుని సంధ్య, డీజీ నరేంద్ర ప్రసాద్, సుభాన్ రెడ్డి, కె.శ్రీనివాస్ (మండల సిపిఐ కార్యదర్శి) సుధాకర్ గౌడ్ తెలియజేశారు. ఆందోళనకారులు ఈశ్వర్ , సికిందర్, డప్పు మహేందర్ డప్పు వరుణ్, నడికుడి విగ్నేష్, అన్సుజా, లక్ష్మమ్మ, మానెమ్మ తదితరులు జరిగిన విషయాలన్నింటిని వివరించారు. గోడు గోడున్న ఏడ్చుకుంటూ ఈ భూమి లేకపోతే మా బ్రతుకులు ఏంటి అని వాపోతున్నారు. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని దళిత సామాన్య రైతుల న్యాయబద్ధమైన డిమాండ్ పట్ల స్పందించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోరుకుంటుంది.


