నేటి సత్య తెల్కపల్లి జులై 23 

*రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం* .
*AISF- AIYF విద్యార్థి, యువజన సంఘాలు.*
ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్. ఏఐవైఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దేశమోని ఆంజనేయులు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ,జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈరోజు తలపెట్టిన బందును విజయవంతం చేస్తూ *తెల్కపల్లి, గౌరేడ్డిపల్లి, పెద్దూర్ ఆలేరు* బందు విజయవంతం అనంతరం ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేశమోని ఆంజనేయులు ,ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని,రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త పాఠశాలు,జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం
బందులో భాగంగా కేకే రెడ్డి పాఠశాలకు ముందస్తు సమాచారం ఇచ్చిన కూడా మేము హాలిడే ప్రకటించిన అని చెప్పి పాఠశాల నడపడం జరిగింది విద్యార్థి సంఘాలుగా మేము వెళ్లి అడగగా మా మీద దురుసుగా మాట్లాడుతూ దాడికి ప్రయత్నించారు, కేకే రెడ్డి స్కూల్ కి అసలు ఎన్ని బిల్డింగు పర్మిషన్ ఉన్నాయి వారు హాస్టల్ కూడా నడుపుతున్నారు ఫీజు నియంతన చట్టం లేకుండా, సరైన సేఫ్టీ లేకుండా పాఠశాలను నడుపుతున్నారు, ఏమైనా ప్రమాద ప్రమాదము జరుగుతే దానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులే బాధ్యత వహించాలి తెలపడం జరిగింది
*డిమాండ్స్*
👉విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని…
👉పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, వెంటనే విడుదల చేయాలని…
👉గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించాలని.
👉మెస్ కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని.
👉విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని.
👉ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలని.
👉బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలని.
👉 ప్రైవేట్,కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని.
👉విద్యార్థులకు RTC లో ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలని.
👉నూతన జాతీయ విద్య విధానం( NEP 2020) తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని. ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి విద్యారంగ సమస్యను పరిష్కరించాలని, వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు తలపెట్టిన విద్యాసంస్థల బంద్ కు సహకరించి, విజయవంతం చేసిన విద్యాసంస్థలకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మధు, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు విష్ణు, లక్ష్మణ్, పర్వతాలు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు