నేటి సత్యం. నాగర్ కర్నూల్ జులై 27 
ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థత గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి .
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బాల నరసింహ గారు డిమాండ్ చేశారు
ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గల మహాత్మ జ్యోతిరావు పూలే విద్యాలయంలో నిన్న రాత్రి భోజనంలో ఫుడ్ పాయిజన్ వల్ల 68మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురై జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారికి గురుకుల పాఠశాలల టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు నాణ్యతలేని సరుకులను పంపించడం వలన విద్యార్థులు తిని అస్వస్థతకు గురయ్యారని ఆయన అన్నారు . ఈ కాంట్రాక్టర్ల పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు సంవత్సర కాలంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇది నాలుగో సారి కావడం చాలా బాధాకరంగా ఉందని ఆయన గుర్తు చేశారు గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వారికి నాణ్యత గల ఆహారాన్ని ఇవ్వకుండా యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను 2500 మంది విద్యార్థులతో ప్రారంభిస్తామని శంకుస్థాపన చేస్తున్నారు ముందుగా మన రాష్ట్రంలో గల జ్యోతిరావు పూలే , కస్తూర్బా , లాంటి పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించి వాటిలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఆ తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను ప్రారంభిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. నాణ్యతలేని సరుకులను పంపించడం వలన విద్యార్థులు అసస్వతకు గురయ్యారని వీటన్నింటికీ కారకులైన కాంట్రాక్టర్లను తక్షణమే సస్పెండ్ చేయాలని ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వార్ల వెంకటయ్య గారు , కే కేశవులు గౌడ్ గారు , ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేసుమల్ల శివకృష్ణ గారు పాల్గొన్నారు.