నేటి సత్యం నగర్ కర్నూల్ జిల్లా ఆగస్టు 3 
*సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శిగా
ఎస్.ఎండి ఫయాజ్ ఎన్నిక*
……
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శిగా ఎస్ఎండి ఫయాజ్ ఎన్నుకున్నారు ఈనెల 1 2 తేదీల్లో కల్వకుర్తి పట్టణంలో జరిగిన సిపిఐ జిల్లా మూడో మహాసభలో ముగింపు రోజు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహాల సమక్షంలో ఫయాజ్ను సిపిఐ జిల్లా రెండో కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఫయాజ్ 19 94 నుండి సిపిఐ ఉద్యమాలలో విద్యార్థి యువజన రంగాలలో పనిచేస్తూ అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు గత ఆరు సంవత్సరాలుగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులుగా పనిచేస్తూ వస్తున్న ఫయాజ్ ఈ మహాసభలో కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది మొత్తం 29 మంది కౌన్సిల్ సభ్యులు ముగ్గురు క్యాండిడేట్ సభ్యులు ఐదుగురు ఆహ్వానితులతో జిల్లా సమితిని 11 మంది కార్యవర్గ సభ్యులతో జిల్లా కౌన్సిల్ ఎన్నికవ్వడం జరిగింది.