నేటి సత్యం నాగర్ కర్నూల్ ఆగస్టు 3 
కల్వకుర్తిలో జరిగినటువంటి నాగర్కర్నూల్ జిల్లా CPI 3వ మహాసభలలో పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపురం గ్రామానికి చెందిన కేశంపేట శ్రీనివాసులు గారు హార్ట్ ఎటాక్ తో అక్కడే మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బాల నరసింహ గారు , సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ ఎం డి ఫయాజ్ గారు , కార్యవర్గ సభ్యులు టి నరసింహ గారు , పెద్దకొత్తపల్లి మండల కార్యదర్శి కామ్రేడ్ బొల్లెద్దుల శ్రీనివాసులు గారు కేశంపేట శ్రీనివాసులు గారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 51 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాగర్కర్నూల్ జిల్లా కార్య వర్గ సభ్యులు కామ్రేడ్ యేసయ్య గారు కౌన్సిల్ సభ్యులు టి మల్లయ్య గారు నాయకులు హుస్సేనయ్య , లక్ష్మణస్వామి , సాయిలు , యూసుఫ్, శివ కృష్ణ , కరీమ్, లక్ష్మీనారాయణ , చింతపల్లి కురుమయ్య , ప్రకాష్ , కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.