నేటి సత్యం
*శేరిలింగంపల్లి: 05-08-2025*
*ఆహ్వానం🙏*
*తెలంగాణ సిద్ధాంతకర్త , ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతిని పురస్కరించుకుని రేపు అనగా 06-08-2025 బుధవారం ఉదయం 09:00 గంటలకు శేరిలింగంపల్లి డివిజన్ లోగల ప్రొఫెసర్ జయశంకర్ సార్ సర్కిల్ (లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి) వద్ద తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అయన విగ్రహానికి శేరిలింగంపల్లి గౌరవ కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు ఘనంగా నివాళులు అర్పిస్తారు. కావున డివిజన్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ లు, సీనియర్ నాయకులు, బస్తీ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జి లు మెంబర్లు, మహిళా నాయకురాళ్లు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు ప్రతిఒక్కరూ సకాలములో విచ్చేసి ఇట్టి కార్యక్రమమును జయప్రదం చేయగలరని మనవి.*