Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్

పాలస్తినకు మద్దతు శాంతి….సంఘీభావం

నేటి సత్యం ఆగస్టు 9

పాలస్తీ నాకు మద్దతుగా హైదరాబాదులో
Aipso ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం

అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో హిమాయత్ నగర్ లో గల శాంతి సంఘీభావ సంగం కార్యాలయం వద్ద పాలస్తీలకు మద్దతు తెలియజేస్తూ ఉద్యమకారులంతా
ప్ల కార్డ్స్ పట్టుకొని సంఘీభావాన్ని ప్రకటించారు .
ఈ సంఘీభావ కార్యక్రమంలో కమిటీ అధ్యక్ష వర్గ సభ్యులు డాక్టర్ డి సుధాకర్, ఐప్స్ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్., రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లు జి. నాగేశ్వరరావు , డాక్టర్ కాచం సత్యనారాయణ గారలు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పాలస్తీనాలో సాగుతున్న స్వాతంత్ర పోరాటానికి మద్దతునిస్తున్నామని సంఘీభావాన్ని తెలియజేస్తు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
గాజాలో ప్రతిరోజు బాంబుల మోత, నరమేధం కొనసాగుతున్నదని ,ఇప్పటికే వేలాదిమంది చిన్నారులు, ప్రాణాలను కోల్పోయారని, తీవ్రంగా గాయపడ్డ వారికి, క్షతగాత్రులకు ఎలాంటి వైద్య సదుపాయాలు గాని, మంచినీళ్లు, ఆహార వసతులు గాని అందించకపోవడం మానవత్వానికి మచ్చని తెలియజేశారు.
అలీన విధానాన్ని కొనసాగించవలసినటువంటి భారత కేంద్ర ప్రభుత్వం, ఇజ్రాయిల్ కు మద్దతునిస్తూ చిరకాలంగా కొనసాగుతున్న భారత దేశ విదేశీ విధానాన్ని పక్కదోవ పట్టించటం పట్ల భారతదేశ శప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం పాలస్తీనాను సమర్థించకపోవడం భారతదేశ పాలసీకి వ్యతిరేకమైన విధానమని తీవ్రంగా విమర్శించారు .

ప్రపంచ దేశాలన్నీ, పలస్తీ నాకు మద్దతునిస్తున్నాయని, కవులు, కళాకారులు, మేధావులు, తమ పాటలు రచనలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గాజాను విధ్వంసం చేస్తున్న ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా, పాలస్తీ నాకు మద్దతుగా నిలబడి పోరాటంలో భాగస్వాములు అవుతున్నారు .కేంద్ర ప్రభుత్వం ఈ పరిణామాలను పట్టించుకోకపోవడం కళ్ళు మూసుకొని పాలు తాగడమేనని ఇది హేయమైన చర్య అని కేంద్ర ప్రభుత్వం మేల్కొని మద్దతుగా నిలబడాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం నాయకులు A.రామరాజ్, జె.కె .శ్రీనివాస్, పోల గాని రవికిషోర్, సుభాష్ యాదవ్, రామచంద్రారెడ్డి, రామనారాయణ, సుధావన్, శివ నాగేశ్వరరావు, జాంగిర్ రజాక్, వెంకటేశ్వర్లు, వినోద్, సాగర్ ఎస్. ఎన్. మూర్తి, సూర్య ప్రకాష్, , రాకేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments