నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 17 
*రేపు మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..*
బంగాళాఖాతంలో ఈ నెల 18, 23 తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. సోమవారం తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 18, 19 తేదీల్లో అత్యంత అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది..