నేటి సత్యం మేడ్చల్ ఆగస్టు 17


*గిరిజన సాంప్రదాయాలకు తీజ్ ఉత్సవాలు ప్రతీక*
*మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు*
*తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు*
గిరిజనుల సాంస్కృతిక వారు నిర్వహించుకునే తీజ్ ఉత్సవాలు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు అన్నారు.తీజ్ ఉత్సవాలు (మొలుకల పండుగ) చివరి రోజైన ఆదివారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ గోర్ బంజారా అసోసియేషన్ చెంగిచర్ల తీజ్ ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు పాల్గొని బంజారాల ఆరాధ్య దైవం దండి మేరామా, సేవాలాల్ కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన యువతులు, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకునే పండుగ తీజ్ పండుగ అన్నారు.ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్ పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నడం ఆనందంగా ఉందన్నారు. అనాదిగా వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్,సుమన్ నాయక్,బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్ గౌడ్, కుర్రి శివ శంకర్, కొత్త సుశాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు