నేటి సత్యం. కొల్లాపూర్. ఆగస్టు 17
ప్రజల సమస్యలపై పోరాడే జెండా ఎర్రజెండా
తీర్నాంపల్లి నూతన శాఖ ఏర్పాటు
ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ గారు
సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ గారు.
ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం తిరుమలంపల్లి గ్రామంలో నూతన శాఖ ఏర్పాటు చేసి పతాకావిష్కరణ చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎం బాల నరసింహ గారు మరియు అతిథులుగా సిపిఐ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ఎండి ఫయాజ్ గారు హాజరయ్యారు. వారు ఇరువురు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో అంతరాలు లేని సమాసమాజ నిర్మాణ కోసమే పోరాడుతుందని అధికారంలో ఏ పార్టీలైన ఉండొచ్చు ప్రజాసమస్యలు ఏవైనా అవి ఇండ్లు కావచ్చు ఉపాధి , విద్య , వైద్యం, దేశంలోని ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పైన పోరాడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కమ్యూనిస్టు పార్టీ అని ఆయన అన్నారు దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాడి 100 సంవత్సరాలు అవుతున్న ఏనాడు దేశంలో గాని రాష్ట్రంలో గాని అధికారంలో లేకున్నా పేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర గల పార్టీ ఏదైనా ఉంది అంటే అది కమ్యూనిస్టు పార్టీ అని ఆయన అన్నారు సాయుధ తెలంగాణ పోరాటంలో బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా అనేక వేలమంది తుపాకి తూటాలకు ఉరికొయ్యలకు వేలాడి ప్రాణాలర్పించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ నేడు దేశంలో అధికరంలో ఉన్న బిజెపి పార్టీ స్వాతంత్రం వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్లు ఇది మన స్వతంత్రం కాదని మనధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటుందని త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించిన బిజెపి పార్టీ 2002 సంవత్సరం వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ల కార్యాలయాల ముందుగాని బిజెపి ఆఫీసులో ముందుగాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి నిరాకరించిన బిజెపి ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చాక దేశ అభివృద్ధి గురించి స్వాతంత్రం గురించి మాట్లాడుతుంది ఆయన అన్నారు. కామ్రేడ్ ఎస్ ఎం డి ఫయాజ్ గారు మాట్లాడుతూ ఈ తిరుమలంపల్లి గ్రామంలో నూతన శాఖను ఏర్పాటు చేసి 40 మంది నూతన సభ్యులు పార్టీలో చేరడం చాలా ఆనందదాయకమని అధికారంలో ఏ పార్టీ ఉన్న ప్రజలకు మేలు జరగాలంటే అది ఒక కమ్యూనిస్టు పార్టీ పోరాటాలతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు ఈ గ్రామంలో యువకులు పార్టీలో చేరడం భవిష్యత్తులో గ్రామంలోని అన్యాయాల పైన మాట్లాడటానికి సమస్యల పైన పోరాటాలు చేయడానికి ఇంకా యువతరాన్ని ప్రోత్సహించి పార్టీలో చేర్పించి పార్టీ బలోపేతానికి పాల్పడాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.