నేటి సత్యం నాగర్కర్నూల్ ఆగస్టు 17
ఎండబెట్ల బ్రిడ్జి నిర్మాణం గూర్చి ఎమ్మెల్యే తీసుకునే చర్యలేమిటి
–బిఎంపి పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్
తాడూరు మండల కేంద్రంలో బిఎంపి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం బహుజన్ ముక్తి పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ భారీగా కురుస్తున్న వర్షాలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని వివిధ గ్రామాలనుండి జిల్లా కేంద్రానికి రాకపోకలకు ఆగిపోడడంతో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచికుళ్ళ రాజేష్ రెడ్డి గారు స్పందిస్తూ గుడిపల్లి, తిర్మలాపూర్ లను సందర్శించి అక్కడి సమస్యలకు స్పందించడంతో పాటు,నాగనూల్ నూతన బ్రిడ్జి చేస్తామని హామీ ఇవ్వడం, మరియు చర్మతిర్మలాపూర్ బ్రిడ్జిని వేస్తామని హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, అదేవిధంగా గత సంవత్సరం కేసరి సముద్రంపై ఎండబెట్ల దగ్గర నూతన బ్రిడ్జిని నిర్మిస్తామని భూమి పూజ కూడా చేశారు కాని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఇట్టి బ్రిడ్జి నిర్మాణం పై ఎమ్మెల్యే ఎలాంటి స్పందన లేదు కావున ఇట్టి బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నాగనూల్,కేసరి సముద్రం, తిర్మలాపూర్ బ్రడ్జీ లతో పాటు గగ్గల పల్లి దగ్గర ఉన్న బ్రిడ్జి కూడా నిర్మాణం చేయాలని ఇట్టి బ్రిడ్జిల నిర్మాణంలో గత సంవత్సరంలో ఇచ్చిన హామీల మాదిరిగా కాకుండా ఈ సారైనా నూతన బ్రిడ్జీలు నిర్మాణం చేసి ప్రజల సమస్యలు పరిష్కరించి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తన చిత్త శుద్దిని నిరూపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపియూఎస్ఐ జిల్లా కార్యదర్శి మిద్దె రాములు, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆదిరాల వెంకటయ్య లు పాల్గొన్నారు.